ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డిపై విచారణ
ABN , Publish Date - Mar 14 , 2025 | 01:09 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి అక్రమాలు, అడ్డగోలు నిర్ణయాలపై ప్రభుత్వం విచారణ జరి పించేందుకు సిద్ధమైంది.

వైసీపీ హయాంలో ప్రసాదరెడ్డి సాగించిన అడ్డగోలు వ్యవహారాలను అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యేలు పల్లా, వెలగపూడి, విష్ణుకుమార్‌రాజు
విజిలెన్స్‌తో విచారణ జరిపిస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటన
మాజీ వీసీపై అనేక ఆరోపణలు
అడ్డగోలుగా నియామకాలు, అస్మదీయులకు కీలక పదవులు, నిధులు దుర్వినియోగం, పీహెచ్‌డీ ప్రవేశాలు నిబంధనల ఉల్లంఘన...
వీసీ కార్యాలయాన్ని వైసీపీ ఆఫీస్‌గా మార్చేశారనే విమర్శలు
విశాఖపట్నం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి అక్రమాలు, అడ్డగోలు నిర్ణయాలపై ప్రభుత్వం విచారణ జరి పించేందుకు సిద్ధమైంది. వైసీపీ హయాంలో ప్రసాదరెడ్డి తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన నియామకాలు, నిధుల దుర్వినియోగం ఆరోపణ లపై విచారణ నిర్వహించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో గురు వారం అసెంబ్లీలో నగరానికి చెందిన ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజులు ప్రసాదరెడ్డి హయాంలో వర్సిటీలో జరిగిన అక్రమాలు, అడ్డగోలు వ్యవహా రాలపై ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్నా విచారణ జరపకపోవడంపై ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ప్రశ్నలపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ ప్రసాదరెడ్డి హయాంలో ఏయూలో జరిగిన అవినీతి, అక్రమాలపై 60 రోజుల్లో విజిలెన్స్ విచారణ పూర్తిచేసి, చర్యలు తీసు కుంటామని ప్రకటించారు. సుమారు రూ.20 కోట్ల రూసా నిధులు దుర్వినియోగం చేశారని, ఇస్రో నుంచి వచ్చిన రూ.25 లక్షల వ్యయంలో కూడా నిబందనలు ఉల్లంఘించారని ఫిర్యాదు అంది నట్టు మంత్రి తెలిపారు.
మాజీ వీసీ వ్యవహారాలపై ఇన్‌చార్జి వీసీ నియమించిన కమిటీ కూడా విచారణ జరిపినట్టు తెలిపారు. విజిలెన్స్ నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులైన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తా మని స్పష్టంచేశారు. మంత్రి ప్రకటనపై వర్సిటీలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అడ్డగోలు వ్యవహారాలన్నీ బయటకు వస్తాయని ఉద్యోగులు, విద్యార్థి సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
ఆరోపణలు ఎన్నో...
- మాజీ వీసీ ప్రసాదరెడ్డి తన హయాంలో రిటైర్డ్ ప్రొఫెసర్లకు అడ్డగోలుగా పదవులు కట్టబెట్టారు. ఈ జాబితాలో మాజీ రిజిస్ర్టార్ ప్రొఫెసర్ కృష్ణమోహన్ ముందువరుసలో ఉంటారు. పదవీ విరమణ తరువాత మూడు సార్లు ఆయనకు రిజిస్ర్టార్‌గా బాధ్యతలు కట్టబెట్టారు. ఆ తరువాత ఓఎస్‌డీగా నియ మించుకున్నారు. అనేక విభాగాల్లో ప్రిన్సిపాల్స్, డీన్లుగా, డైరెక్టర్లుగా పదవీ విరమణ చేసిన వారికి అవకాశం కల్పించారు.
ఫ రూసా, పూర్వ విద్యార్థులు అందించిన నిధులు దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. భవన నిర్మాణాల్లో భారీగా నిధులు దుర్వినియోగం అయినట్టు ఫిర్యాదులు ఉన్నాయి.
ఫ రిజిస్ర్టార్‌గా వర్సిటీతో సంబంధం లేని వ్యక్తికి అవకాశం కల్పించారు. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమన్న ఆరోపణలు ఉన్నాయి.
ఫ నిబంధనలకు విరుద్ధంగా టీడీఆర్ హబ్‌లో ప్రవేశాలు కల్పించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం భారీగా డబ్బులు చేతులు మారినట్టు ప్రచారం ఉంది.
ఫ నార్త్ క్యాంపస్ పరిధిలో చిట్టడవిని తలపించేలా వేలాది వృక్షాలు ఉండేవి. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ వాటిని తొలగించి, బయట వ్యక్తులకు కట్టబెట్టి నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉంది.
ఫ వర్సిటీలో మొక్కల తొలగించిన ప్రాంతంలో మైదానాన్ని తయారుచేసేందుకు కొందరు బయటి వ్యక్తులు నిధులు ఇచ్చారు. ఎంత ఇచ్చారు?, ఎంత ఖర్చు చేశారన్నది ఎవరికీ తెలియదు. ఈ నిధులు వినియోగం లెక్క తేల్చాల్సి ఉంది.
ఫ వాహనాలకు డీజిల్ బిల్లుల్లోనూ అడ్డగోలుగా మెక్కేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా పాడైన వాహనాల విక్రయించడం (స్ర్కాప్)లోనూ పెద్దఎత్తున అవకతవకాలు జరిగాయంటారు.
ఫ వీసీ ఛాంబర్‌ను ప్రసాదరెడ్డి పూర్తిగా వైసీపీ కార్యాలయంగా మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటి సీఎం జగన్, దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ విజయలక్ష్మి, అప్పటి ఎంపీ విజయసాయిరెడ్డి పుట్టినరోజు వేడుకలను ఛాంబర్‌లోనే జరిపారు.
ఫ అనేక కోర్సులను పూర్తిగా ఎత్తేశారు. ఫీజులను ఇష్టానుసారంగా పెంచేశారు. తనకు నచ్చని ఎంతోమంది గెస్ట్ ఫ్యాకల్టీలను తొలగించారు.
ఫ రాష్ట్రంలో మరే వర్సిటీలో లేనివిధంగా ఎయిడెడ్ ఫ్యాకల్టీని వర్సిటీలోకి తీసుకువచ్చారు. ఇందుకు భారీగానే వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.