అంతర్రాష్ట్ర రహదారి అధ్వానం
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:58 AM
అసలే అధ్వానంగా వున్న జీకేవీధి-సీలేరు అంతర్రాష్ట్ర రహదారి... తుఫాన్ కారణంగా కురిసిన కొద్దిపాటి వర్షాని మరింత దారుణంగా తయారైంది. జీకేవీధి నుంచి లంకపాకల వరకు రహదారిపై అడుగడుగునా ఏర్పడిన గోతుల్లో వర్షం నీరు నిలిచింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జీకేవీధి- లంకపాకల మధ్య అడుగడుగునా గోతులు
రోడ్డు నిర్మాణ పనుల్లో నిబంధనలకు తూట్లు
కొరవడిన ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణ
తుఫాన్ వర్షాలతో పరిస్థితి మరింత దయనీయం
తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, ప్రయాణికులు
సీలేరు, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): అసలే అధ్వానంగా వున్న జీకేవీధి-సీలేరు అంతర్రాష్ట్ర రహదారి... తుఫాన్ కారణంగా కురిసిన కొద్దిపాటి వర్షాని మరింత దారుణంగా తయారైంది. జీకేవీధి నుంచి లంకపాకల వరకు రహదారిపై అడుగడుగునా ఏర్పడిన గోతుల్లో వర్షం నీరు నిలిచింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఈ రహదారి, విస్తరణ, అభివృద్ధి పనులను చేపట్టిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా మందకొడిగా సాగుతున్నాయి. రహదారిని ఎక్స్‌కవేటర్‌తో చదునుచేసి, కొత్తరోడ్డు వేసిన తరువాత ఇరువైపులా బెర్మ్‌లను మట్టితో పూడ్చాలి. కానీ రోడ్డు చదును చేసి, బీటీ వేయలేదు. రోడ్డుకు ఇరువైపులా అంచులను మట్టితో కప్పి వదిలేశారు. దీంతో ఇటీవల తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు నీరుంతా రోడ్డు మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో వాహనదారులు, ప్రయాణికుల ఇక్కట్లు మరింత పెరిగాయి. ఇది ముమ్మాటికీ ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యమేనని, దీని వల్ల ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉందని డీసీసీ కార్యదర్శి కారే శ్రీనివాస్ ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయడంతోపాటు నిబంధల మేరకు పనులు జరిగేలా చూడాలని ఆయన కోరారు.