అంతర్ జిల్లా టెబుల్ టెన్నిస్ పోటీలు ప్రారంభం
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:05 PM
ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి జడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలోని ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 69వ అంతర్ జిల్లా టేబుల్ టెన్నిస్ పోటీలను పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు శనివారం ప్రారంభించారు.
క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే గణబాబు
గోపాలపట్నం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి జడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలోని ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 69వ అంతర్ జిల్లా టేబుల్ టెన్నిస్ పోటీలను పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఎంతో కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించాలని సూచించారు. డీఈవో ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపడంతో పాటు వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారిని జాతీయ స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందన్నారు. అండర్-14, అండర్-17, అండర్-19 బాలబాలికల విభాగాల్లో జరుగుతున్న ఈ పోటీల్లో సుమారు 500 మంది పాల్గొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో సోమేశ్వరరావు, రాష్ట్ర స్కూల్ గేమ్ ఫెడరేషన్ సభ్యులు డాక్టర్ డీవీఎస్‌వై శర్మ, తదితరులు పాల్గొన్నారు.