Share News

పర్యాటక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు

ABN , Publish Date - Nov 12 , 2025 | 12:35 AM

ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాల్లో అరకు సీఐ ఎల్‌.హిమగిరి, ఎస్‌ఐ జి.గోపాలరావు ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.

పర్యాటక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు
అరకు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల లగేజీని తనిఖీ చేస్తున్న ఎస్‌ఐ గోపాలరావు, రైల్వే పోలీసులు

ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో సోదాలు

అరకులోయ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాల్లో అరకు సీఐ ఎల్‌.హిమగిరి, ఎస్‌ఐ జి.గోపాలరావు ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. మంగళవారం అరకు ఆర్టీసీ కాంప్లెక్స్‌, అరకు రైల్వే స్టేషన్‌, అలాగే గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌, కాఫీహౌస్‌లలో తనిఖీలు చేశారు. అనుమానిత లగేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. పర్యాటక ప్రాంతాలు, ఆర్టీసీ కాంప్లెక్స్‌, రైల్వే స్టేషన్‌లో ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు.

Updated Date - Nov 12 , 2025 | 12:35 AM