ముమ్మరంగా వెదురు కొమ్ముల సేకరణ
ABN , Publish Date - Aug 10 , 2025 | 01:13 AM
గిరిజన ప్రాంతంలో ఆదివాసీ యువత అడవిలో వెదురు కొమ్ములు(బేంబూ షూట్స్) సేకరించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
చింతపల్లి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో ఆదివాసీ యువత అడవిలో వెదురు కొమ్ములు(బేంబూ షూట్స్) సేకరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడం, వెదురు కొమ్ముల సీజన్ ప్రారంభం కావడంతో యువత అడవికి వెళ్లి వెదురు కొమ్ములను సేకరిస్తున్నారు. గిరిజనులు వెదురు కొమ్ములను ప్రియమైన ఆహారంగా తీసుకుంటారు. వెదురు కొమ్ముల్లో మెండైన పోషకాలు ఉంటాయి. ఈ సీజన్‌లో విరివిగా లభిస్తున్నాయి. శనివారం యర్రవరం యువత జలపాతం పరిసర ప్రాంతాల్లో వెదురు కొమ్ములు సేకరిస్తూ కనిపించారు.