టీడీపీ ఫ్లోర్ లీడర్ పదవికి తీవ్ర పోటీ
ABN , Publish Date - May 22 , 2025 | 01:30 AM
మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల పంచాయితీ కొలిక్కివచ్చిందని ఊపిరి పీల్చుకుంటున్న తెలుగుదేశం పార్టీ నేతలకు ఇప్పుడు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ ఎంపిక తలనొప్పిగా మారింది. ఫ్లోర్‌లీడర్‌గా ఉన్న పీలా శ్రీనివాసరావు మేయర్ కావడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా పనిచేస్తున్న గంధం శ్రీనివాసరావుకు అవకాశం కల్పించాలని మేయర్‌తోపాటు కొందరు ఎమ్మెల్యేలు భావించారు. అయితే డిప్యూటీ మేయర్ పదవిని ఆశించిన కొందరు...కనీసం ఫ్లోర్‌లీడర్‌గా అయినా అవకాశం ఇవ్వాలని తమకు సన్నిహితంగా ఉండే ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది.
రేస్‌లో గంధం శ్రీనివాసరావు, గొలగాని మంగవేణి, పల్లా శ్రీనివాసరావు
విశాఖపట్నం, మే 21 (ఆంధ్రజ్యోతి):
మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల పంచాయితీ కొలిక్కివచ్చిందని ఊపిరి పీల్చుకుంటున్న తెలుగుదేశం పార్టీ నేతలకు ఇప్పుడు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ ఎంపిక తలనొప్పిగా మారింది. ఫ్లోర్‌లీడర్‌గా ఉన్న పీలా శ్రీనివాసరావు మేయర్ కావడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా పనిచేస్తున్న గంధం శ్రీనివాసరావుకు అవకాశం కల్పించాలని మేయర్‌తోపాటు కొందరు ఎమ్మెల్యేలు భావించారు. అయితే డిప్యూటీ మేయర్ పదవిని ఆశించిన కొందరు...కనీసం ఫ్లోర్‌లీడర్‌గా అయినా అవకాశం ఇవ్వాలని తమకు సన్నిహితంగా ఉండే ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. రెండుసార్లు కౌన్సిలర్‌గా, రెండుసార్లు కార్పొరేటర్‌గా పనిచేయడంతోపాటు డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా ఉన్న గంధం శ్రీనివాసరావు కూడా డిప్యూటీ మేయర్ పదవిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. చివరకు ఆ పదవిని జనసేనకు కేటాయించడంతో మనస్థాపానికి గురయ్యారు. మేయర్, ఇతర ప్రజా ప్రతినిధులు బుజ్జగించడంతో మంగళవారం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికకు హాజరయ్యారు. మరోవైపు డిప్యూటీ మేయర్ పదవి కోసం చివరి వరకూ పోటీపడిన గొలగాని మంగవేణి, 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు కూడా ఫ్లోర్ లీడర్ పదవిని ఆశిస్తున్నారు. ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.