Share News

సీలేరు పంప్డ్‌ స్టోరేజీ నిర్మాణ ప్రాంతం పరిశీలన

ABN , Publish Date - Aug 10 , 2025 | 11:55 PM

సీలేరు పంప్డ్‌ స్టోరేజీ నిర్మాణ ప్రాంతాన్ని జెన్‌కో అధికారులు ఆదివారం పరిశీలించారు. జెన్‌కో ముఖ్య ఇంజనీర్లు రవీంద్రరెడ్డి, కేవీ రాజారావులు దుప్పిలవాడ పంచాయతీ శాండికొరి నుంచి చింతపల్లి క్యాంప్‌ వరకు సర్వే చేశారు.

సీలేరు పంప్డ్‌ స్టోరేజీ నిర్మాణ ప్రాంతం పరిశీలన
పంప్డ్‌ స్టోరేజీ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న జెన్‌కో అధికారులు

సర్వే చేసిన జెన్‌కో అధికారులు

సీలేరు, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): సీలేరు పంప్డ్‌ స్టోరేజీ నిర్మాణ ప్రాంతాన్ని జెన్‌కో అధికారులు ఆదివారం పరిశీలించారు. జెన్‌కో ముఖ్య ఇంజనీర్లు రవీంద్రరెడ్డి, కేవీ రాజారావులు దుప్పిలవాడ పంచాయతీ శాండికొరి నుంచి చింతపల్లి క్యాంప్‌ వరకు సర్వే చేశారు. జలవిద్యుత్‌ కేంద్రం నిర్మించే పార్వతీ నగర్‌, డైవర్షన్‌ డ్యామ్‌ నిర్మించే శాండికొరి, భూగర్భ టన్నెల్‌ కోసం సూచించిన పాయింట్లను అధికారులు పరిశీలించారు. అటవీశాఖ అనుమతులు తుది దశకు వచ్చాయని, అటవీశాఖ నుంచి అభ్యంతరాలు రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. భూగర్భ పైపులైన్‌ నిర్మాణంలో వచ్చే మట్టిని నిల్వ చేసే డంపింగ్‌ యార్డులపై మరోసారి ప్రతిపాదనలు చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ మేరకు చింతపల్లి క్యాంప్‌, లైఖన్‌పూర్‌ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈఈ(సివిల్‌) రత్నకుమార్‌, డీఈఈ అప్పలనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Aug 10 , 2025 | 11:55 PM