Share News

ఓవర్‌ లోడుతో వెళుతున్న వాహనాల తనిఖీ

ABN , Publish Date - Aug 04 , 2025 | 11:38 PM

స్పీకర్‌ అయ్యన్నపాత్రుడి ఆదేశాల మేరకు వెంకన్నపాలెం వద్ద ఓవర్‌ లోడుతో వెళుతున్న వాహనాలు తనిఖీ చేసేందుకు తాత్కాలిక చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు.

ఓవర్‌ లోడుతో వెళుతున్న వాహనాల తనిఖీ
చెక్‌పోస్టు వద్ద లారీల వేబిల్లులను తనిఖీ చేస్తున్న ఆర్డీవో

మాకవరపాలెం, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): స్పీకర్‌ అయ్యన్నపాత్రుడి ఆదేశాల మేరకు వెంకన్నపాలెం వద్ద ఓవర్‌ లోడుతో వెళుతున్న వాహనాలు తనిఖీ చేసేందుకు తాత్కాలిక చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. సోమవారం బాక్సైట్‌ ముడి సరుకు తీసుకువస్తున్న లారీలను ఆర్‌డీవో వి.వి.రమణ, సీఐ రేవతమ్మ, ఎస్‌ఐ దామోదర్‌నాయుడు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్‌డీవో మాట్లాడుతూ తాళ్లపాలెం వద్ద ఉన్న వంతెన ప్రమాదంలో ఉండడంతో ఓవర్‌లోడు వాహనాలను అరికట్టాలనే ఉద్దేశంతోనే చెక్‌పోస్టు ఏర్పాటు చేశామన్నారు. పయనీర్‌ కంపెనీకి గంగవరం పోర్టు నుంచి ముడిసరుకును ఆధిక లోడుతో తీసుకురావడంతో తాళ్లపాలెం వంతెన ప్రమాదంలో ఉందన్నారు. ఇప్పటికే ఈ వంతెనను స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పరిశీలించారన్నారు. ఈ నేపపథ్యంలోనే చెక్‌పోస్టు ఏర్పాటు చేసి ఓవర్‌ లోడు లారీల బిల్లును తనిఖీ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ చెక్‌పోస్టు వద్ద ఆర్‌టీవో, పోలీసు సిబ్బంది ఉంటారన్నారు. అయితే వెంకన్నపాలెం వద్ద చెక్‌పోస్టు ఏర్పాటుతో రోలుగుంట నల్లరాయి లారీలు బొడ్డేపల్లి నుంచి అడ్డురోడ్‌ మీదుగా రాంబిల్లి వెళుతున్నాయి.

Updated Date - Aug 04 , 2025 | 11:38 PM