మాడగడ పీహెచ్‌సీలో సేవలపై ఆరా
ABN , Publish Date - Nov 27 , 2025 | 11:36 PM
మండలంలోని మాడగడ పీహెచ్‌సీని గురువారం డీఎంహెచ్‌వో కృష్ణమూర్తినాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో
ప్రసవాల సంఖ్య పెంచాలని సిబ్బందికి సూచన
విధులకు గైర్హాజరైన సీనియర్ అసిస్టెంట్‌కు రెండురోజుల జీతం నిలిపివేత
అరకులోయ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మాడగడ పీహెచ్‌సీని గురువారం డీఎంహెచ్‌వో కృష్ణమూర్తినాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వారికి అందించాల్సిన వైద్యసేవలపై పలు సూచనలందించారు. అనంతరం రికార్డులు, హాజరు రిజిస్టర్ పరిశీలించారు. విధులకు గైర్హాజరైన సీనియర్ అసిస్టెంట్ ఎస్.సింహాచలంకు రెండురోజులు జీతం నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అటెండర్ విధులకు ఆలస్యంగా రావడంపై మందలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలోని ప్రసవాల సంఖ్యను పెంచాలని, కాన్పు అనంతరం 48 గంటల వైద్యసిబ్బంది పర్యవేక్షణలో తల్లీబిడ్డ ఉండాలన్నారు. ఆరోగ్యంగా ఉన్నట్టు నిర్ధారించిన అనంతరం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా వారిని తరలించాలని సూచించారు. సిబ్బంది అందుబాటులో లేకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పీహెచ్‌సీ వైద్యాధికారిణి వసంత, తదితరులు ఉన్నారు.