Share News

బల్క్‌ డ్రగ్‌ పార్కు ప్రాంతంలో పరిశ్రమల కార్యదర్శి పర్యటన

ABN , Publish Date - Jun 06 , 2025 | 12:33 AM

మండలంలో బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటు కానున్న రాజయ్యపేట, పెదతీనార్ల, కాగిత గ్రామాల్లో గురువారం పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌, కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ పర్యటించారు. బల్క్‌డ్రగ్‌ పార్కు కోసం రాజయ్యపేట పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పలు నిర్మాణ పనులను పరిశీలించారు. పెదతీనార్లలో కొన్ని భూములను పరిశీలించారు.

బల్క్‌ డ్రగ్‌ పార్కు ప్రాంతంలో పరిశ్రమల కార్యదర్శి పర్యటన
బల్క్‌డ్రగ్‌ పార్కు భూముల మ్యాపును పరిశీలిస్తున్న పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌, కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌

కలెక్టర్‌ విజయకృష్ణన్‌తో కలిసి పనులు పరిశీలించిన యువరాజ్‌

నక్కపల్లి, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): మండలంలో బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటు కానున్న రాజయ్యపేట, పెదతీనార్ల, కాగిత గ్రామాల్లో గురువారం పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌, కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ పర్యటించారు. బల్క్‌డ్రగ్‌ పార్కు కోసం రాజయ్యపేట పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పలు నిర్మాణ పనులను పరిశీలించారు. పెదతీనార్లలో కొన్ని భూములను పరిశీలించారు. అవసరమైతే అదనంగా భూములు సేకరించడానికి స్థానిక అధికారులను ఆరా తీశారు. ఆర్డీవో వీవీ రమణ, తహసీల్దార్‌ నరసింహమూర్తితో మాట్లాడారు. భూములకు సంబంధించిన మ్యాప్‌లను పరిశీలించారు. రాజయ్యపేట నుంచి అమలాపురం మీదుగా కాగిత గ్రామం వద్ద జాతీయ రహదారి వరకు నిర్మిస్తున్న విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ నూతన రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. స్టీల్‌ప్లాంట్‌, బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటుకు సంబంధించి అవసరమైన భూములతోపాటు, మరికొంత భూమిని సిద్ధంగా వుంచుకోవాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Jun 06 , 2025 | 12:33 AM