కృష్ణాష్టమి వేడుకల్లో అసభ్యకర నృత్యాలు
ABN , Publish Date - Aug 18 , 2025 | 11:42 PM
మేజర్ పంచాయతీ ఏటికొప్పాకలో కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి నిర్వాహకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువతులు పొట్టి దుస్తులు వేసుకుని అసభ్యకర నృత్యాలు చేయడం కలకలం రేపింది.
పొట్టి దుస్తులతో యువతుల డ్యాన్సులు
ఎలమంచిలి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): మేజర్ పంచాయతీ ఏటికొప్పాకలో కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి నిర్వాహకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యువతులు పొట్టి దుస్తులు వేసుకుని అసభ్యకర నృత్యాలు చేయడం కలకలం రేపింది. వారితో కొందరు యువకులు జత కలిసి డ్యాన్సులు చేశారు. సుమారు గంట సేపు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చిన మహిళలు ఇబ్బంది పడ్డారు. ఈ విషయమై రూరల్ ఎస్‌ఐ ఉపేంద్రను సోమవారం వివరణ కోరగా డ్యాన్సులు జరుగుతున్నట్టు సమాచారం రావడంతో ఆ కార్యక్రమాన్ని నిలిపి వేయించామని తెలిపారు.