Share News

పెరిగిన వేరుశనగ ధర

ABN , Publish Date - Jul 19 , 2025 | 10:50 PM

హుకుంపేటలో శనివారం సంతలో వేరుశనగకు మంచి ధర పలికింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

పెరిగిన వేరుశనగ ధర
సంతలో విక్రయానికి తీసుకువచ్చిన వేరుశనగ బస్తాలు

బస్తా రూ.1500 నుంచి రూ.1700 వరకు కొనుగోలు

తొలుత రూ.800 కొనుగోలు చేస్తామన్న వ్యాపారులు

సరుకు ఇవ్వమని స్పష్టం చేసిన గిరిజన రైతులు

దిగొచ్చిన వ్యాపారులు.. అధిక ధరలకు కొనుగోలు

ఆనందంలో వేరుశనగ రైతులు

హుకుంపేట, జూలై 19 (ఆంధ్రజ్యోతి): హుకుంపేటలో శనివారం సంతలో వేరుశనగకు మంచి ధర పలికింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. గత వారం వేరుశనగ బస్తా ధర బాగా పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెందారు. కొందరు విక్రయించగా.. మరికొందరు ఇంటికి తిరిగి తీసుకుపోయారు. ఈ వారం కూడా రైతులు వేరుశనగ బస్తాలను సంతకు తీసుకువచ్చారు. వ్యాపారులు గత వారం వలె బస్తా రూ.800లకు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇందుకు రైతులు ఇవ్వలేమని తేల్చి చెప్పేశారు. దీంతో వ్యాపారులు దిగి వచ్చి వేరుశనగ బస్తా రూ.1500లకు కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు సరుకును విక్రయించారు. వ్యాపారులు కూడా వేరుశనగ కొనుగోలు చేయడానికి పోటీ పడ్డారు. కొంతమంది వ్యాపారులు రూ.1700 వరకు వేరుశనగ బస్తాను కొనుగోలు చేశారు. దీంతో గిరిజన రైతులు సంబరపడ్డారు. వచ్చే వారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 19 , 2025 | 10:50 PM