శారదా నదిలో పెరిగిన వరద
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:43 AM
అనకాపల్లి వద్ద శారదా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువున ఉన్న పెద్దేరు, రైవాడ, కోనాం జలాశయాలు పూర్తిగా నిండిపోయి, తరచూ గేట్లు ఎత్తుతుండడంతో శారదా నదిలో వరద ప్రవాహం పెరిగింది. రెండు రోజుల క్రితం వరకు సాధారణంగా ఉన్న ప్రవాహం క్రమేపీ పెరుగుతున్నది. శారదా నది ఒడ్డున ఉన్న ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయం వెనుక మెట్ల వరకు వరద నీరు వచ్చేసింది.
అనకాపల్లి టౌన్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి వద్ద శారదా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువున ఉన్న పెద్దేరు, రైవాడ, కోనాం జలాశయాలు పూర్తిగా నిండిపోయి, తరచూ గేట్లు ఎత్తుతుండడంతో శారదా నదిలో వరద ప్రవాహం పెరిగింది. రెండు రోజుల క్రితం వరకు సాధారణంగా ఉన్న ప్రవాహం క్రమేపీ పెరుగుతున్నది. శారదా నది ఒడ్డున ఉన్న ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయం వెనుక మెట్ల వరకు వరద నీరు వచ్చేసింది.
పట్టణంలో గురువారం దఫదఫాలుగా వర్షం కురిసింది. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణ ఎప్పటి మాదిరిగానే చెరువును తలపించింది. విజయరామరాజుపేట అండర్‌బ్రిడ్జి కింద నీరు నిలిచిపోవడంతో ద్విచక్ర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎన్టీఆర్ వైద్యాలయం ఎదుట రోడ్డు పల్లంగా ఉండడంతో వర్షపునీరు నిలిచిపోయి ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బంది పడ్డారు.