మన్యంలో పెరిగిన చలి
ABN , Publish Date - Oct 18 , 2025 | 11:28 PM
మన్యంలో క్రమంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతున్నది.
తగ్గుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
చింతపల్లి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మన్యంలో క్రమంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతున్నది. శనివారం చింతపల్లిలో 18.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణంగా అక్టోబరు రెండో వారం నుంచి గిరిజన ప్రాంతంలో శీతాకాల వాతావరణం కనిపిస్తుంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తాయి. ఈ ఏడాది అధిక వర్షాలతో శీతాకాల వాతావరణం కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం రెండు రోజులుగా రాత్రివేళ చలి ఉధృతి కనిపిస్తున్నది. ఉదయం, రాత్రి వేళల్లో మంచు కురుస్తున్నది. దీంతో ప్రాంతీయ ప్రజలు చలిని ఎదుర్కొనేందుకు సిద్ధపడుతున్నారు. పక్కన పెట్టిన రగ్గులు, ఉన్ని దుస్తులను బయటకు తీసి ధరించుకుంటున్నారు. ఈ ఏడాది డిసెంబరు, జనవరిల్లో చలి ఉధృతి అధికంగా ఉంటుందని ఆర్‌ఏఆర్‌ఎస్ వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు చెబుతున్నారు.