Share News

ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంపు

ABN , Publish Date - Jun 20 , 2025 | 12:57 AM

ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచుతున్నామని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంపు

విశాఖకు 100 ఎలక్ర్టిక్‌ బస్సులు

రోడ్డు రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

విశాఖపట్నం, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి):

ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచుతున్నామని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. ద్వారకా బస్‌ స్టేషన్‌లో సీఎంఆర్‌, స్టాల్స్‌ అసోసియేషన్‌ సహకారంతో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ద్వారకా బస్‌ స్టేషన్‌ను సందర్శించినప్పుడు సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తే నేరాలను నియంత్రించవచ్చునని ప్రయాణికులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు చెప్పారన్నారు. ఆ మేరకు వీటిని ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు. విశాఖకు 100 ఎలక్ర్టిక్‌ బస్సులను కేటాయించామన్నారు. ప్రస్తుతం విశాఖలో 750 బస్సులు ఉన్నాయని, మరిన్ని పెంచుతామన్నారు. కార్యక్రమంలో విజయనగరం జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కేఎస్‌ బ్రహ్మానందరెడ్డి, విశాఖపట్నం రీజనల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు, డిప్యూటీ చీఫ్‌ పర్సనల్‌ మేనేజర్‌ ఎం.సుధాబిందు, ద్వారకా బస్‌ స్టేషన్‌ అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ పీబీఎంకె రాజు, పర్సనల్‌ ఆఫీసర్‌ జె.తిరుపతి, విజిలెన్స్‌, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2025 | 12:57 AM