Share News

మరింత మెరుగ్గా పారిశుధ్య పనులు

ABN , Publish Date - Dec 20 , 2025 | 01:48 AM

మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్‌ పీలా శ్రీనివాసరావు శుక్రవారం పట్టణంలోని నెయ్యిలవీధి, రింగురోడ్డు, పిళ్లావారివీధి, చేపల మార్కెట్‌ ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. డ్రైనేజీ కాలువల్లో పూడికలను ఎప్పటికప్పుడు తొలగించాలని, పారిశుధ్య పనులు మరింత మెరుగుపడాలని జోనల్‌ అధికారులను ఆదేశించారు.

మరింత మెరుగ్గా పారిశుధ్య పనులు

రోడ్లపై పశువుల సంచారాన్ని అరికట్టండి

జీవీఎంసీ అధికారులకు మేయర్‌ ‘పీలా’ ఆదేశాలు

అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి):

మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్‌ పీలా శ్రీనివాసరావు శుక్రవారం పట్టణంలోని నెయ్యిలవీధి, రింగురోడ్డు, పిళ్లావారివీధి, చేపల మార్కెట్‌ ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. డ్రైనేజీ కాలువల్లో పూడికలను ఎప్పటికప్పుడు తొలగించాలని, పారిశుధ్య పనులు మరింత మెరుగుపడాలని జోనల్‌ అధికారులను ఆదేశించారు. రోడ్లపై పశు సంచారం లేకుండా చూడాలని వెటర్నరీ అధికారులకు సూచించారు. ఇప్పటికే ఉన్న మొక్కలను సంరక్షించడంతోపాటు అవసరమైనచోట కొత్తగా మొక్కలు నాటించాలని చెప్పారు. రింగురోడ్డు వద్ద పంట కాలువపై జాలీలు వేయడానికి అంచనాలు రూపొందించి పంపాలని అధికారులను ఆదేశించారు. చేపల బజార్‌ ప్రదేశంలో రూ.50 లక్షలతో రెండు అంతస్థుల భవన నిర్మాణానికి అంచనాలు తయారు చేయాలన్నారు. రోడ్లపై ఉన్న గుంతలకు తాత్కాలికంగా ప్యాచ్‌వర్కులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మేయరు వెంట జోనల్‌ కమిషనర్‌ కె.చక్రవర్తి, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ నరేశ్‌, టీపీవో, ఈఈలు, కూటమి నాయకులు మాదంశెట్టి నీలబాబు, కొణతాల భాస్కరరావు, తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 20 , 2025 | 01:48 AM