Share News

ఒకరికి ఒకరు తోడుంటే..

ABN , Publish Date - Jul 30 , 2025 | 11:18 PM

మండలంలో ఆదివాసీ రైతులు వ్యవసాయ పనుల్లోనూ ఐక్యత చాటుకుంటున్నారు. ఆదివాసీ రైతులకు వ్యవసాయ పనుల కోసం కూలీలను పెట్టుకునే ఆర్థిక స్థోమత లేదు.

ఒకరికి ఒకరు తోడుంటే..
అద్దరవీధిలో దుక్కి చేస్తున్న గిరిజన రైతులు

వ్యవసాయ పనుల్లో ఆదివాసీల ఐక్యత

కూలీల అవసరం లేకుండా పరస్పర సహకారం

గూడెంకొత్తవీధి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఆదివాసీ రైతులు వ్యవసాయ పనుల్లోనూ ఐక్యత చాటుకుంటున్నారు. ఆదివాసీ రైతులకు వ్యవసాయ పనుల కోసం కూలీలను పెట్టుకునే ఆర్థిక స్థోమత లేదు. దీంతో గ్రామానికి చెందిన గిరిజనులందరూ ఒకరి పనుల్లో ఒకరు సహాయం చేసుకుంటారు. దుక్కులు, ఆకుతీత, వరి నాట్లు పనుల్లో గ్రామానికి చెందిన గిరిజనులందరూ కలిసి పని చేస్తుంటారు. ఒక రోజు ఒకరి పొలం దున్నేందుకు రైతులు అందరూ వస్తే, మరో రోజు వేరే రైతు పొలం దున్నేందుకు వెళతారు. దుక్కి, ఆకుతీత, వరి నాట్లులోనూ ఇదే పద్ధతిని అనుసరిస్తారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వ్యవసాయ పనులు చేసుకుంటారే తప్ప కూలి డబ్బులు చెల్లించే పద్ధతి అరుదు. బుధవారం అద్దరవీధిలో గిరిజన రైతులందరూ ఒక రైతు పంట పొలాల్లో దుక్కిచేస్తూ కనిపించారు. అలాగే లంకపాకలు గ్రామంలో వరి నాట్లు కోసం మహిళలందరూ ఒకే రైతుకి చెందిన ఆకు(నారు) సేకరణ పనులు చేపట్టారు.

Updated Date - Jul 30 , 2025 | 11:18 PM