Share News

అనకాపల్లికి ఐసీడీఎస్‌ పీడీ సూర్యలక్ష్మి బదిలీ

ABN , Publish Date - Jun 03 , 2025 | 12:23 AM

స్థానిక మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎన్‌.సూర్యలక్ష్మిని తాజా బదిలీల్లో భాగంగా అనకాపల్లి జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఏర్పడినప్పటికీ నుంచి ఆమె ఇక్కడ ఐసీడీఎస్‌ పీడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

అనకాపల్లికి ఐసీడీఎస్‌ పీడీ సూర్యలక్ష్మి బదిలీ
ఎన్‌.సూర్యలక్ష్మి

- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

పాడేరు, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): స్థానిక మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎన్‌.సూర్యలక్ష్మిని తాజా బదిలీల్లో భాగంగా అనకాపల్లి జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఏర్పడినప్పటికీ నుంచి ఆమె ఇక్కడ ఐసీడీఎస్‌ పీడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో అంగన్‌వాడీ సేవలు క్షేత్ర స్థాయిలో అందించడంతోపాటు చిన్నారులు, యుక్త వయస్సు బాలికలు, గర్భిణులు, బాలింతలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పలు పథకాల అమలులోనూ ఆమె చక్కని చొరవ చూపారనే ప్రత్యేక గుర్తింపు ఉంది. మూడేళ్లు ఇక్కడ పని చేసిన ఆమెను అనకాపల్లి బదిలీ చేసిన ప్రభుత్వం, ఆమె స్థానంలో ఇక్కడ ఇంకా ఎవర్నీ నియమించలేదు.

Updated Date - Jun 03 , 2025 | 12:23 AM