హైడ్రో పవర్ ప్రాజెక్టు సరిహద్దు దిమ్మ తొలగింపు
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:23 PM
మండలంలోని గుమ్మకోట పంచాయతీ బురదగెడ్డ గ్రామ సమీపంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన సరిహద్దు దిమ్మను మంగళవారం అఖిలపక్షం ఆధ్వర్యంలోని గిరిజనులు తొలగించారు.
బురదగెడ్డ సమీపంలో అఖిల పక్ష నాయకుల ఆందోళన
అనంతగిరి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గుమ్మకోట పంచాయతీ బురదగెడ్డ గ్రామ సమీపంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన సరిహద్దు దిమ్మను మంగళవారం అఖిలపక్షం ఆధ్వర్యంలోని గిరిజనులు తొలగించారు. ఈ సందర్భంగా ఆదివాసీ అధికార రాష్ట్రీయమంచ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్స, జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి పి.బాలదేవ్, సర్పంచ్ అప్పారావు మాట్లాడుతూ గుజ్జెలి, చిట్టంపాడు, పెదకోట రేగుళ్లపాలెం వద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టుకు అనుకూలంగా ఇచ్చిన జీవో 51ను వెంటనే రద్దుచేయాలన్నారు. గుజ్జెలి వద్ద దిగువ ప్రాజెక్టు ఏర్పాటుకు సరిహద్దు దిమ్మలను ఏర్పాటు చేయడంపై వీరు మండిపడ్డారు. అరకులోయ మండలం ఇరగాయి, లోతేరు, దూదికొండ, ముర్రిగుడ, కాగువలస పరిసరాల్లో ఎగువ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన సరిహద్దు దిమ్మలను అఖిలపక్షం ఆధ్వర్యంలో గిరిజనులు తొలగించారన్నారు. ఈ కార్యక్రమంలోని వెంకటరమణ, సురేశ్‌బాబు, కొండన్న, తదితరులు పాల్గొన్నారు.