ఎలమంచిలిలో కూలిన భారీ వృక్షం
ABN , Publish Date - Aug 08 , 2025 | 12:48 AM
పట్టణంలో తహశీల్దారు కార్యాలయం ఎదుట, ప్రధాన రహదారి పక్కన వున్న భారీ వృక్షం గురువారం ఉదయం ఒక్కసారిగా కూలిపోయింది. సుమారు 11 గంటల సమయంలో జరిగిన ఈ హఠాత్‌పరిణామంతో అక్కడ వున్న వారు భయాందోళన చెందారు.
ముప్పు నుంచి త్రుటిలో తప్పించుకున్న స్థానికులు
ఎలమంచిలి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో తహశీల్దారు కార్యాలయం ఎదుట, ప్రధాన రహదారి పక్కన వున్న భారీ వృక్షం గురువారం ఉదయం ఒక్కసారిగా కూలిపోయింది. సుమారు 11 గంటల సమయంలో జరిగిన ఈ హఠాత్‌పరిణామంతో అక్కడ వున్న వారు భయాందోళన చెందారు. చెట్టు కూలేటప్పుడు శబ్దం రావడంతో దాని కింద వున్న వారు దూరంగా పరుగెత్తారు. ఎవరికీ ముప్పు వాటిల్లకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. చెట్టు కింద వున్న నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వల్పంగా దెబ్బతిన్నాయి. కాగా రోడ్డుకు అడ్డంగా చెట్టు పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న మునిసిపల్ కమిషనర్ ప్రసాదరాజు స్పందించి, ఎక్స్‌కవేటర్ సాయంతో చెట్లును తొలగింపజేశారు. సుమారు 50 ఏళ్ల క్రితంనాటిన మొక్క.. మహావృక్షంగా ఎదిగింది. అయితే చెట్టు మొదలు వద్ద చెద పట్టడంతో బలహీనంగా మారి కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు.