బలిమెల జలాశయంలో భారీ చేప
ABN , Publish Date - Dec 21 , 2025 | 11:22 PM
సీలేరు కాంప్లెక్సు జలవిద్యుత్ కేంద్రాలకు నీటిని సరఫరా చేసే బలిమెల జలాశయంలో గిరిజనుల వలకు ఆదివారం భారీ చేప చిక్కింది.
55 కిలోల బరువు.. రూ.15 వేలకు విక్రయం
సీలేరు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు జలవిద్యుత్ కేంద్రాలకు నీటిని సరఫరా చేసే బలిమెల జలాశయంలో గిరిజనుల వలకు ఆదివారం భారీ చేప చిక్కింది. 55 కిలోల బరువున్న ఈ చేపను ఈ ప్రాంతంలో ‘దోబీ’ చేపగా పిలుస్తారు. దీనిని సీలేరులో అమ్మకానికి తీసుకురాగా బాలాజీ రెస్టారెంట్ నిర్వాహకులు రూ.15 వేలకు కొనుగోలు చేశారు. 15 నుంచి 20 కిలోల బరువుండే చేపలు లభ్యమయ్యే బలిమెల జలాశయంలో ఏకంగా 55 కిలోల బరువున్న ఇంత పెద్ద చేప లభ్యం కావడం విశేషమని గిరిజనులు తెలిపారు.