Share News

రైల్వే గేటుతో ఎన్ని కష్టాలో..

ABN , Publish Date - Nov 25 , 2025 | 12:29 AM

మునిసిపాలిటీలోని పెదపల్లి రైల్వే గేటు అవతల ఉన్న పలు కాలనీల ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు.

రైల్వే గేటుతో ఎన్ని కష్టాలో..
పెదపల్లి రైల్వే గేటు వద్ద నిలిచిన వాహనాలు

వాహనచోదకుల అవస్థలు

గంటల తరబడి పడిగాపులు

అండర్‌ పాస్‌ వే కోసం ఎదురుచూపులు

ఎలమంచిలి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీలోని పెదపల్లి రైల్వే గేటు అవతల ఉన్న పలు కాలనీల ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. రైళ్ల రాకపోకల సమయంలో రైల్వే గేటు వేసి ఉండడంతో వాహనచోదకులు గంటల తరబడి వేచి ఉంటున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులకు అవస్థలు తప్పడం లేదు.

మునిసిపాలిటీలోని పెదపల్లి, గొల్లలపాలెం, మంత్రిపాలెం, శేషుకొండ, చిన్న గొల్లలపాలెం, రామ్‌నగర్‌, టిడ్కో కాలనీ సముదాయం, అల్లూరి సీతారామరాజు కాలనీ ప్రాంతాలకు చెందిన వేలాది మంది ప్రజలు ఎలమంచిలి పట్టణంలోకి రావాలంటే ప్రతి రోజూ పెదపల్లి రైల్వే గేటు దాటాల్సిందే. రైళ్ల సంఖ్య పెరగడంతో వాటి రాకపోకల సమయంలో గేటు వేసి ఉంటుంది. దీంతో గేటు వద్ద వాహనచోదకులకు పడిగాపులు తప్పడం లేదు. అత్యవసర సమయంలో ఆస్పత్రులకు వెళ్లే వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి అండర్‌ పాస్‌ వే నిర్మించాలని ఎన్నో ఏళ్లగా ప్రజలు కోరుతున్నారు. కానీ అది కార్యరూపం దాల్చడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ చొరవ తీసుకుని రైల్వే, మునిసిపల్‌ అఽధికారుల సమన్వయంతో అండర్‌ పాస్‌ వే నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసేలా కృషి చేశారు. దీంతో అండర్‌ పాస్‌ వే నిర్మిస్తే తమ కష్టాలు తీరతాయని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - Nov 25 , 2025 | 12:29 AM