అర్హులందరికీ ఇళ్లు
ABN , Publish Date - Jun 28 , 2025 | 01:14 AM
అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ రాబోయే నాలుగేళ్లలో ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థ సారథి పేర్కొన్నారు.
పేదల గృహ నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం
గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థ సారథి
పనులు ప్రారంభమైన వాటిని ముందు పూర్తి చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు
పనులు జాప్యం చేసే కాంట్రాక్టర్లను ఉపేక్షించేది లేదు
విశాఖపట్నం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి):
అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ రాబోయే నాలుగేళ్లలో ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థ సారథి పేర్కొన్నారు. గృహ నిర్మాణంపై హౌసింగ్, విద్యుత్, ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయతీరాజ్ అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధులతో శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ పేదల గృహ నిర్మాణానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. లేఅవుట్లలో మౌలిక సదుపాయాలపై ప్రత్యే కంగా దృష్టిసారించామన్నారు. తాగునీటి కోసం ప్రభుత్వం నుంచి కూడా నిధులు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం పనులు మొదలైన వాటిని 100 శాతం పూర్తిచేయాలని, గ్రౌండ్ కానీ వాటిని ప్రారంభించవద్దన్నారు. గతంలో అనర్హులకు ఇచ్చినట్టయితే వారిని తొలగించడానికి జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మా ణంలో ప్రగతి చూపని కాంట్రాక్టర్లను ఉపేక్షించేది లేదన్నారు. హౌసింగ్ అధికారులు రోజువారీ లక్ష్యాలు విధించుకుని, ఈ ఏడాది చివరి నాటికి గృహ నిర్మాణాలు పూర్తి చేయా లన్నారు. హుద్‌హుద్ ఇళ్లు అప్పటి జాబితా ప్రకారమే లబ్ధిదారులకు అందించాలన్నారు. ముదపాక లేఅవుట్‌పై కోర్టు కేసును జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేలు రైతులతో మాట్లాడి పరిష్కరించాలన్నారు. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ లేఅవుట్లలో తాగునీటి కోసం జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదం తీసుకుని మొదటి దశలో రూ.20 కోట్లు అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు మంజూరు చేయించా లన్నారు. గడిచిన మూడు నెలలుగా జిల్లాలో ఇళ్ల నిర్మాణం వేగవంతమైందన్నారు. 2026 మార్చిలోగా నూరుశాతం పూర్తిచేస్తామని కలెక్టర్ వెల్లడించారు. సమావేశంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీఆర్‌వో భవానీశంకర్, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, హౌసింగ్ సీఈ రామ్మోహన్‌రావు, పీడీ సత్తిబాబు, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు.