Share News

వడగాడ్పులు.. వర్షాలు!

ABN , Publish Date - Jun 07 , 2025 | 12:42 AM

జిల్లాలో మాడుగుల, చోడవరం, అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో శుక్రవారం మధ్యాహ్నం తరువాత ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఉరుములతో పలుచోట్ల పిడుగులు పడ్డాయి. ఈదురుగాలుల కారణంగా చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. కొన్ని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అంతకుముందు మధ్యాహ్నం వరకు ఎండ తీక్షణంగా కాయడంతోపాటు వడగాడ్పులు వీచాయి. ఉక్కపోతతో జనం విలవిలలాడారు. ఆ తరువాత వర్షం కురిసి వాతావరణం చల్లబడడంతో ఉపశమనం చెందారు.

వడగాడ్పులు.. వర్షాలు!
జలమయమైన తుమ్మపాల మెయిన్‌రోడ్డు

జిల్లాలో భిన్న వాతావరణం

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీక్షణంగా కాసిన ఎండ

వడగాడ్పులు, ఉక్కపోతతో జనం విలవిల

మధ్యాహ్నం తరువాత ఈదురుగాలులతో వర్షం

పలుచోట్ల కూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

వాతావరణం చల్లబడడంతో ఉపశమనం

(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్‌)

జిల్లాలో మాడుగుల, చోడవరం, అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో శుక్రవారం మధ్యాహ్నం తరువాత ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఉరుములతో పలుచోట్ల పిడుగులు పడ్డాయి. ఈదురుగాలుల కారణంగా చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. కొన్ని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అంతకుముందు మధ్యాహ్నం వరకు ఎండ తీక్షణంగా కాయడంతోపాటు వడగాడ్పులు వీచాయి. ఉక్కపోతతో జనం విలవిలలాడారు. ఆ తరువాత వర్షం కురిసి వాతావరణం చల్లబడడంతో ఉపశమనం చెందారు.

అనకాపల్లి పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. 21.8 ఎం.ఎం.గా వర్షపాతం నమోదైనట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. అనకాపల్లి మండలంలోని తుమ్మపాల, దిబ్బపాలెం, సత్యనారాయణపురం, పిసినికాడ, మార్టూరు, కొత్తూరు, తదితర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయం అయ్యాయి. డ్రైనేజీ కాలువలు పూడుకుపోవడంతో వర్షం నీరు రోడ్లపై ప్రవహించింది. అనకాపల్లి- చోడవరం రోడ్డులో పలుచోట్ల నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

ఎలమంచిలిలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాడుపగిలేలా ఎండకాసింది. ఆ తరువాత వాతావరణం మారిపోయి ఈదురుగాలులతో వర్షం కురిసింది. వాతావరణం చల్లబడడంతో ఎండ తాపం నుంచి ప్రజలు ఉపశమనం చెందారు. పరవాడ, ఫార్మాసిటీ, వాడచీపురుపల్లి, ఎన్టీపీసీ తదితర ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం సుమారు అర గంటపాటు మోస్తరు వర్షం కురిసింది. మాడుగుల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. గాలులు వీచడంతో వాతావరణం చల్లబడిది. గొలుగొండ మండలం ఏఎల్‌పురం, కొంగశింగి, సీహెచ్‌.నాగాపురం, పాతకృష్ణాదేవిపేట తదితర గ్రామాల్లో గురువారం మద్యాహ్నం వర్షం పడింది.

దేవరాపల్లి మండలంలో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. బి.కింతాడ, కొత్తూరు, కలిగొట్ల శివారు బండారుపాలెం, వేచలం, మామిడిపల్లి, తదితర గ్రామాల్లో బలమైన గాలులు వీచడంతో విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. బండారుపాలెంలో ట్రాన్స్‌ఫారం ధ్వంసమైంది. ఆయా గ్రామాలకు విద్యుస్‌ సరఫరా నిలిచిపోయింది. ఈపీడీసీఎల్‌ సిబ్బంది రంగంలోకి దిగి పునరుద్ధరణ పనులు చేపట్టారు.

Updated Date - Jun 07 , 2025 | 12:42 AM