Share News

ఆర్టీసీ బస్సులో హోం మంత్రి ప్రయాణం

ABN , Publish Date - Aug 30 , 2025 | 11:25 PM

రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం అమలు తీరుపై హోం మంత్రి అనిత ఆరా తీశారు.

ఆర్టీసీ బస్సులో హోం మంత్రి ప్రయాణం
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ జీరో ఫేర్‌ టికెట్‌ చూపిస్తున్న హోం మంత్రి అనిత

స్త్రీశక్తి పథకం అమలు తీరుపై అనిత ఆరా

నక్కపల్లి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం అమలు తీరుపై హోం మంత్రి అనిత ఆరా తీశారు. ఆమె శనివారం సాయంత్రం వేంపాడు నుంచి అడ్డరోడ్డు వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. ఉచిత బస్సు సదుపాయం ఎలా ఉందని వారిని అడిగి తెలుసుకున్నారు. బస్సులో ఉన్న పిల్లలు, పెద్దలను ఆప్యాయంగా పలకరించారు.

Updated Date - Aug 30 , 2025 | 11:25 PM