హోం మంత్రి అనిత ఉదారత
ABN , Publish Date - Oct 20 , 2025 | 12:51 AM
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మరోసారి ఉదారతను, మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఆదివారం ఉదయం మంత్రి కాన్వాయ్ క్యాంపు కార్యాలయం నుంచి నెల్లూరు బయలుదేరింది. అడ్డరోడ్డు వద్ద యూ టర్స్ తీసుకుని నక్కపల్లి వైపు వస్తుండగా.. అదే సమయంలో తహశీల్దారు కార్యాలయం సమీపంలో హైవేపై బైక్ ప్రమాదానికి గురైంది. యువకుడు కిందపడిపోయి గాయపడ్డాడు.
కాన్వాయ్‌ని ఆపి క్షతగాత్రుడికి పరామర్శ
మంత్రి ఆదేశాలతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లిన పోలీసులు
నక్కపల్లి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మరోసారి ఉదారతను, మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఆదివారం ఉదయం మంత్రి కాన్వాయ్ క్యాంపు కార్యాలయం నుంచి నెల్లూరు బయలుదేరింది. అడ్డరోడ్డు వద్ద యూ టర్స్ తీసుకుని నక్కపల్లి వైపు వస్తుండగా.. అదే సమయంలో తహశీల్దారు కార్యాలయం సమీపంలో హైవేపై బైక్ ప్రమాదానికి గురైంది. యువకుడు కిందపడిపోయి గాయపడ్డాడు. మంత్రి అనిత వెంటనే తన కాన్వాయ్‌ను ఆపి, క్షతగాత్రుడి వద్ద వెళ్లి ధైర్యం చెప్పారు. ఇతను కోటవురట్ల మండలం రామచంద్రాపురానికి చెందిన జోగేశ్‌గా గుర్తించి, వెంటనే సీహెచ్‌సీకి తీసుకెళ్లాలని ఎస్కార్ట్ సిబ్బందిని ఆదేశించారు. దీంతో పోలీసులు కాన్వాయ్‌లోని ఒక వాహనంలోకి క్షతగాత్రుడిని ఎక్కించుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మంత్రి కాన్వాయ్ అక్కడి నుంచి కదిలింది.