Share News

చింతూరు ఏఎస్‌పీగా హేమంత్‌ బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Nov 06 , 2025 | 11:16 PM

జిల్లాలోని చింతూరు పోలీస్‌ డివిజన్‌ ఏఎస్‌పీగా బొడ్డు హేమంత్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు.

చింతూరు ఏఎస్‌పీగా హేమంత్‌ బాధ్యతల స్వీకరణ
బాధ్యతలు స్వీకరిస్తున్న బొడ్డు హేమంత్‌

పాడేరు/చింతూరు, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని చింతూరు పోలీస్‌ డివిజన్‌ ఏఎస్‌పీగా బొడ్డు హేమంత్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఏఎస్‌పీగా పని చేసిన పంకజ్‌కుమార్‌ మీనాను తాజా బదిలీల్లో జిల్లా అదనపు(అడ్మిన్‌) ఎస్‌పీగా నియమించారు. ఈ క్రమంలో ప్రస్తుతం గ్రేహౌండ్స్‌లో అసాల్ట్‌ కమాండెంట్‌గా పని చేస్తున్న 2023 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన బొడ్డు హేమంత్‌ను చింతూరు ఏఎస్‌పీగా నియమించారు. దీంతో ఆయన గురువారం బాధ్యతలు చేపట్టారు. డివిజన్‌లో పోలీసుల సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని ఈసందర్భంగా ఏఎస్‌పీ హేమంత్‌ పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది ఆయనకు సాదర స్వాగతం పలికారు.

Updated Date - Nov 06 , 2025 | 11:16 PM