ఈదురు గాలులతో భారీ వర్షం
ABN , Publish Date - Oct 02 , 2025 | 12:27 AM
మండలంలో బుధవారం మధ్యాహ్నం తరువాత సుమారు రెండు గంటలపాటు ఈదురు గాలులతో కుండపోతగా వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరిపొలాలు పూర్తిగా నిండిపోయి గట్ల మీదుగా నీరు పొర్లి ప్రవహించింది. వడ్డాది- పాడేరు ఆర్‌అండ్‌బీ రోడ్డులో పలుచోట్ల గోతుల్లో నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా ఘాట్ రోడ్డు జంక్షన్ దాటిన తరువాత డి.సురవరం వద్ద రహదారిపై ఏర్పడిన భారీ గోతుల్లో నీరు చేరి పంట కుంటలుగా దర్శనమిచ్చాయి. ఎంత లోతు వుంటుందో అంచనా వేయలేక పలువురు ద్విచక్ర వాహనదారులు పక్కన వున్న ప్రైవేటు స్థలాల్లో నుంచి వెళ్లాల్సి వచ్చింది. గోతుల వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సి రావడంతో ప్రయాణ సమయం రెట్టింపు అయ్యిందని పలువురు వాపోయారు.
నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
మరోసారి నిండిన ‘కల్యాణపులోవ’
మాడుగుల రూరల్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): మండలంలో బుధవారం మధ్యాహ్నం తరువాత సుమారు రెండు గంటలపాటు ఈదురు గాలులతో కుండపోతగా వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరిపొలాలు పూర్తిగా నిండిపోయి గట్ల మీదుగా నీరు పొర్లి ప్రవహించింది. వడ్డాది- పాడేరు ఆర్‌అండ్‌బీ రోడ్డులో పలుచోట్ల గోతుల్లో నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా ఘాట్ రోడ్డు జంక్షన్ దాటిన తరువాత డి.సురవరం వద్ద రహదారిపై ఏర్పడిన భారీ గోతుల్లో నీరు చేరి పంట కుంటలుగా దర్శనమిచ్చాయి. ఎంత లోతు వుంటుందో అంచనా వేయలేక పలువురు ద్విచక్ర వాహనదారులు పక్కన వున్న ప్రైవేటు స్థలాల్లో నుంచి వెళ్లాల్సి వచ్చింది. గోతుల వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సి రావడంతో ప్రయాణ సమయం రెట్టింపు అయ్యిందని పలువురు వాపోయారు.
కాగా మండలంలో పెద్దేరు జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. గరిష్ఠ నీటిమట్టం 137 మీటర్లు కాగా బుధవారం 245 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోతో 136.6 మీటర్లకు చేరింది. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో స్పిల్‌వేలో ఒక గేటు ఎత్తి 200 క్యూసెక్కుల నీటిని పెద్దేరు నదిలోకి విడిచిపెడుతున్నట్టు ఏఈ సుధాకరరెడ్డి తెలిపారు.
రోలుగుంటలో..
రోలుగుంట, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం మధ్యాహ్నం తరువాత ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఎంకే పట్నం పంచాయతీ పెదపేటలో చెట్లు కూటి విద్యుత్ వైర్లపై పడడంతో స్తంభాలు ఒరిగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రంగంలో దిగిన ఈపీడీసీఎల్ సిబ్బంది చెట్లను తొలగించి విద్యుత్ వైర్లను సరిచేశారు.
మరోసారి నిండిన కల్యాణపులోవ
రావికమతం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): మండలంలో కల్యాణపులోవ జలాశయం నీటిమట్టం మరోసారి గరిష్ఠ స్థాయికి చేరింది. ఎగువనున్న ఏజెన్సీ ప్రాంతం నుంచి 250 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 460 అడుగులు కాగా, బుధవారం 458.6 అడుగులకు చేరడంతో స్పిల్‌వేలో రెండు గేట్లను ఎత్తి 200 క్యూసెక్కుల నీటిని సర్పా నదిలోకి విడిచిపెడుతున్నట్టు ప్రాజెక్టు ఏఈ డి.సూర్య తెలిపారు. రావికమతం, రోలుగుంట, మాకవరపాలెం మండలాల్లో నది పక్కన వున్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆయన కోరారు.