Share News

మన్యంలో భారీ వర్షం

ABN , Publish Date - Jun 23 , 2025 | 11:40 PM

మన్యంలో సోమవారం తెల్లవారుజాము నుంచి ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వాతావరణం చల్లబడడంతో జనం ఊరట చెందారు. పాడేరులో తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు భారీగా, ఆ తరువాత నుంచి ఒక మోస్తరు వర్షం కొనసాగింది.

మన్యంలో భారీ వర్షం
పాడేరు అంబేడ్కర్‌ సెంటర్‌లో సోమవారం వర్షం కురుస్తున్న దృశ్యం

ముంచంగిపుట్టులో అత్యధికంగా 16.2 మిల్లీమీటర్ల వర్షపాతం

పాడేరు, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): మన్యంలో సోమవారం తెల్లవారుజాము నుంచి ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వాతావరణం చల్లబడడంతో జనం ఊరట చెందారు. పాడేరులో తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు భారీగా, ఆ తరువాత నుంచి ఒక మోస్తరు వర్షం కొనసాగింది. ముంచంగిపుట్టులో అత్యధికంగా 16.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, జి.మాడుగులలో 15.4, పాడేరులో 15.2, పెదబయలులో 11.8, చింతపల్లిలో 10.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. డుంబ్రిగుడ, అనంతగిరి, హుకుంపేట, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో 6 మిల్లీమీటర్లలోపు వర్షపాతం నమోదైంది. కాగా భారీ వర్షం కురిసినప్పటికీ గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మాత్రం మార్పు కనిపించలేదు. చింతపల్లిలో 31.9, కొయ్యూరులో 31.1, జీకేవీధిలో 27.2, పెదయలులో 26.1, జి.మాడుగులలో 25.4, పాడేరులో 25.4, అరకులోయలో 24.9, హుకుంపేట, డుంబ్రిగుడలో 24.8, అనంతగిరిలో 24.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Jun 23 , 2025 | 11:40 PM