Share News

మన్యంలో భారీ వర్షం

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:33 PM

మన్యంలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో అప్పటి వరకు ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో జనం ఊరట చెందారు. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని ఏజెన్సీలోని అన్ని మండలాల్లోనూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

మన్యంలో భారీ వర్షం
పాడేరు- విశాఖపట్నం మెయిన్‌రోడ్డులో వర్షం

చల్లబడిన వాతావరణం

ఉదయం ఎండ... మధ్యాహ్నం వాన

కొయ్యూరులో 38.3 డిగ్రీలు

పాడేరు, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): మన్యంలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో అప్పటి వరకు ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో జనం ఊరట చెందారు. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని ఏజెన్సీలోని అన్ని మండలాల్లోనూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పాడేరులో ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సాధారణ వాతావరణం నెలకొని, ఎండ తీవ్రంగానే కాసింది. అయితే మధ్యాహ్నం రెండు గంటల తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఆకాశం మేఘావృతమై సుమారు గంట సేపు భారీగా వర్షం కురిసింది. పాడేరు, పరిసర ప్రాంతాలతో పాటు హుకుంపేట, జి.మాడుగుల, అనంతగిరి, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరులో వర్షం పడింది.

కొయ్యూరులో 38.3 డిగ్రీల ఉష్ణోగ్రత

ఏజెన్సీలో సోమవారం వర్షం కురిసినప్పటికీ గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో మాత్రం పెద్దగా మార్పులేదు. కొయ్యూరులో 38.3 డిగ్రీలు, పాడేరులో 37.3, జీకేవీధిలో 35.0, చింతపల్లిలో 33.5, ముంచంగిపుట్టులో 33.3, అరకులోయలో 32.5, డుంబ్రిగుడ, అనంతగిరిలో 31.8, హుకుంపేటలో 31.0, పెదబయలులో 29.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Apr 28 , 2025 | 11:33 PM