Share News

ఎలమంచిలిలో భారీ వర్షం

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:12 AM

ఎలమంచిలి పట్టణంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు సుమారు గంటన్నరపాటు ఉరుములు, పిడుగుల మోతతో కుండపోతగా వాన పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండకాసి, వాతావరణం సాధారణంగానే వుంది. అయితే చీకటి పడిన తరువాత అనూహ్యంగా వాతావరణం మారిపోయింది.

ఎలమంచిలిలో భారీ వర్షం
ఎలమంచిలిలో కురుస్తున్న వర్షం

రహదారులన్నీ జలమయం

పొంగిన శేషుగెడ్డ.. స్తంభించిన ట్రాఫిక్‌

ఎలమంచిలి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి పట్టణంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు సుమారు గంటన్నరపాటు ఉరుములు, పిడుగుల మోతతో కుండపోతగా వాన పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండకాసి, వాతావరణం సాధారణంగానే వుంది. అయితే చీకటి పడిన తరువాత అనూహ్యంగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై భారీ వర్షం పడింది. పిడుగులు పడుతుండడంతోపాటు గాలి కూడా వీస్తుండడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈపీడీసీఎల్‌ అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. కాగా భారీ వర్షం కారణంగా పట్టణంలో వీధి రోడ్లతోపాటు ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. ఎల్‌ఐసీ కార్యాలయం రోడ్డు, ఎంపీడీఓ కార్యాలయం రోడ్డు, క్లబ్‌ రోడ్డు, కొత్తపేట రోడ్డు, తదితర చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. డ్రైనేజీలు పొంగడంతో రహదారులపై బురద, చెత్తాచెదారం పేరుకుపోయాయి. కాగా ఎగువున్న వున్న పెదపల్లి ప్రాంతంలో కురిసిన వర్షంతో శేషుగెడ్డకు భారీగా వరద వచ్చింది. రాత్రి 9.30 గంటల సమయంలో గెడ్డ పొంగి, పాత జాతీయ రహదారి మీదుగా నీరు ప్రవహించింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Updated Date - Oct 06 , 2025 | 12:12 AM