అనకాపల్లిలో భారీ వర్షం
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:41 AM
పట్టణంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పలు రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పూడిమడకరోడ్డు జంక్షన్‌లో హైవేకు ఇరువైపులా, విజయరామరాజుపేట అండర్‌బ్రిడ్జి కింద భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణ ఎప్పటి మాదిరిగానే చెరువును తలపించింది. ఎస్.రాయవరం మండలంలో సుమారు గంటన్నరపాటు కుండపోతగా వర్షం కురిసింది.
లోతట్టు ప్రాంతాలు జలమయం
అనకాపల్లి టౌన్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పలు రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పూడిమడకరోడ్డు జంక్షన్‌లో హైవేకు ఇరువైపులా, విజయరామరాజుపేట అండర్‌బ్రిడ్జి కింద భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణ ఎప్పటి మాదిరిగానే చెరువును తలపించింది. ఎస్.రాయవరం మండలంలో సుమారు గంటన్నరపాటు కుండపోతగా వర్షం కురిసింది.
లంకెలపాలెం ప్రాంతంలో..
లంకెలపాలెం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ 79, 85 వార్డుల పరిధి లంకెలపాలెం, పెదముషిడివాడ, కన్నూరు, మంత్రిపాలెం పరిసర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం సుమారు గంటపాటు భారీ వర్షం కురిసింది. లంకెలపాలెం- ఫార్మాసిటీ రహదారిలో ఏలేరు కాలువ వంతెన పైనుంచి నీరు పారింది. వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు. డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో మురుగు రహదారుల పైకి ప్రవహించింది.
గొలుగొండ మండలంలో..
కృష్ణాదేవిపేట, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గొలుగొండ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం పడుంది. గెడ్డలు, వాగుల్లో నీటి ప్రవాహం పెరిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై గోతుల్లో నీరు చేరి వాహనదారులు ఇబ్బంది పడ్డారు.