దంచికొట్టిన వాన
ABN , Publish Date - Oct 25 , 2025 | 01:10 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా నాతవరం మండలంలో 52 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నాతవరంలో అత్యధికంగా 52 మి.మీ.లు
అనకాపల్లి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా నాతవరం మండలంలో 52 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మండలాల వారీగా నమోదైన వర్షం పాతం వివరాలు.. కె.కోటపాడులో 51.2 మిల్లీమీటర్లు, కోటవురట్లలో 48.8, రోలుగుంటలో 48.2, చోడవరంలో 45.2, మాకవరపాలెంలో 42.6, కశింకోటలో 40.8, ఎలమంచిలిలో 37.6, దేవరాపల్లిలో 34.6, గొలుగొండలో 34, మునగపాకలో 31.4, పాయకరావుపేటలో 27.8, నర్సీపట్నంలో 27.4, అనకాపల్లిలో 24.6, పరవాడలో 23.2, బుచ్చెయ్యపేటలో 23.2, నక్కపల్లిలో 20.2, అచ్యుతాపురంలో 19.2, రావికమతంలో 17.2, మాడుగులలో 15, సబ్బవరంలో 13.6, రాంబిల్లిలో 12.4, చీడికాడలో 9.2, ఎస్.రాయవరం మండలంలో 6.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శుక్రవారం పగలు అక్కడక్కడా ఒక మోస్తరు వర్షం కురవగా, సాయంత్రం రావికమతం మండలంలో కుండపోతగా వర్షం కురిసింది.