భారీ వర్షం
ABN , Publish Date - May 23 , 2025 | 12:47 AM
జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాయగా, సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.
- సీలేరులో మూడు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం
సీలేరు, మే 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాయగా, సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. జీకేవీధి మండలం సీలేరు, ధారాలమ్మ ఘాట్ రోడ్డు, దుప్పులవాడ సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీని వల్ల ఘాట్ రోడ్డులో పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. జల విద్యుత్ కేంద్రం నుంచి సీలేరుకు విద్యుత్ సరఫరా అయ్యే విద్యుత్ లైన్‌లో ఇక ఇన్స్‌లేటర్ పేలిపోవడంతో సీలేరులో మూడు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
అరకులోయలో...
అరకులోయ: మండలంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండకాసింది. ఆ తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటల వరకు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. గత పదిహేను రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది.