Share News

క్రీడలతో ఆరోగ్యం, ఆత్మ స్థైర్యం

ABN , Publish Date - May 07 , 2025 | 12:29 AM

పిల్లలు తమకు నచ్చిన క్రీడల్లో రాణించేందుకు బాల్యం నుంచే నిరంతరం సాధన చేయాలని, ఇందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సూచించారు. నక్కపల్లిలో రూ.1.6 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆస్ర్టో టర్ఫ్‌ మినీ హాకీ గ్రౌండ్‌ను మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్రీడలతో పిల్లలకు మంచి ఆరోగ్యంతోపాటు, మానసిక స్థైర్యం కలుగుతుందని చెప్పారు.

క్రీడలతో ఆరోగ్యం, ఆత్మ స్థైర్యం
నూతన హాకీ మైదానాన్ని ప్రారంభిస్తున్న హోం మంత్రి వంగలపూడి అనిత

హోం మంత్రి అనిత

నక్కపల్లిలో నూతన హాకీ మైదానం ప్రారంభం

నక్కపల్లి, మే 6 (ఆంధ్రజ్యోతి): పిల్లలు తమకు నచ్చిన క్రీడల్లో రాణించేందుకు బాల్యం నుంచే నిరంతరం సాధన చేయాలని, ఇందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సూచించారు. నక్కపల్లిలో రూ.1.6 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆస్ర్టో టర్ఫ్‌ మినీ హాకీ గ్రౌండ్‌ను మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్రీడలతో పిల్లలకు మంచి ఆరోగ్యంతోపాటు, మానసిక స్థైర్యం కలుగుతుందని చెప్పారు. రాష్ట్రం నాలుగుచోట్ల ఆధునిక హాకీ మైదానాలు నిర్మించగా, అందులో ఇది ఒకటని తెలిపారు. హాకీలో స్థానిక యువతకు శిక్షణ ఇస్తున్న బీఎస్‌ హాకీ క్లబ్‌ వ్యవస్థాపకుడు బలిరెడ్డి సూరిబాబును ఆమె అభినందించారు. హాకీ మైదానం వద్ద విద్యుత్తు, తాగునీటి సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. పాయకరావుపేటలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, స్టేడియం నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి అనిత చెప్పారు. ఈ కార్యక్రమంలో హాకీ అసోసియేషన్‌ ప్రతినిధులు, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండలస్థాయి అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2025 | 12:29 AM