Share News

కష్టపడే కార్యకర్తలకు పదవుల్లో ప్రాధాన్యం

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:38 AM

తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తల గౌరవాన్ని పెంచేందుకు అధిష్ఠానం తగిన పదవులు కట్టబెడుతున్నదని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఆదివారం ఇక్కడ టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో జరిగిన సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడుగులు వేస్తున్నారని, ఐదేళ్ల వైసీపీ పాలనలో గాడితప్పిన రాష్ట్రాన్ని ఏడాదిలోనే అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు.

కష్టపడే కార్యకర్తలకు  పదవుల్లో ప్రాధాన్యం
సమావేశంలో మాట్లాడుతున్న హోం మంత్రి వంగలపూడి అనిత

రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్న సీఎం చంద్రబాబు

అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాష్ట్ర హోం మంత్రి అనిత

తుమ్మపాల (అనకాపల్లి), ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తల గౌరవాన్ని పెంచేందుకు అధిష్ఠానం తగిన పదవులు కట్టబెడుతున్నదని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఆదివారం ఇక్కడ టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో జరిగిన సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడుగులు వేస్తున్నారని, ఐదేళ్ల వైసీపీ పాలనలో గాడితప్పిన రాష్ట్రాన్ని ఏడాదిలోనే అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. అనకాపల్లి పార్లమెంట్‌ పరిశీలకులు, బాపట్ల జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ, దేశంలో కోటి మందికిపైగా సభ్యత్వాలు కలిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ టీడీపీ అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొని, టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత కార్యకర్తలదేనన్నారు. జగన్‌రెడ్డి దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు కార్యకర్తలు చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. పార్టీ పదవుల విషయంలో సీనియర్లకు ప్రాధాన్యతం ఇవ్వడంతోపాటు ఇదే సమయంలో యువతకు అవకాశాలు కల్పిస్తూ మహిళలకు పెద్ద పీట వేస్తున్నట్టు చెప్పారు. తొలుత కార్యాలయ ప్రాంగణంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, జీవీఎంసీ మేయర్‌ పీలా శ్రీనివాసరావు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, ఏపీఐడీసీ చైర్మన్‌ డేగల ప్రభాకర్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ కోట్ని బాలాజీ, నాయకులు ప్రగడ నాగేశ్వరరావు, వంశీ, చింతకాయల రాజేశ్‌, కోరాడ రాజబాబు, బొండా జగన్‌, లాలం కాశీనాయుడు, దాడి రత్నాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2025 | 12:38 AM