జీవీఎంసీకి మూడు జాతీయ అవార్డులు
ABN , Publish Date - Dec 15 , 2025 | 01:17 AM
దేశంలోని పట్టణ స్థానిక సంస్థల పనితీరుపై ‘పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా’ నిర్వహించిన అధ్యయనంలో జీవీఎంసీకి జాతీయస్థాయిలో మూడు అవార్డులు లభించాయి. ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆరాష్ట్ర శాసనసభ స్పీకర్ రీతూఖండూరీభూషణ్ చేతుల మీదుగా జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి, పీఆర్వో ఎన్.నాగేశ్వరరావు అవార్డులను అందుకున్నారు.
ఉత్తరాఖండ్ స్పీకర్ చేతులమీదుగా అందుకున్న అధికారులు
విశాఖపట్నం, డిసెంబరు 14 (ఆంధ్ర జ్యోతి): దేశంలోని పట్టణ స్థానిక సంస్థల పనితీరుపై ‘పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా’ నిర్వహించిన అధ్యయనంలో జీవీఎంసీకి జాతీయస్థాయిలో మూడు అవార్డులు లభించాయి. ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆరాష్ట్ర శాసనసభ స్పీకర్ రీతూఖండూరీభూషణ్ చేతుల మీదుగా జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి, పీఆర్వో ఎన్.నాగేశ్వరరావు అవార్డులను అందుకున్నారు. నగరవాసులకు జీవీఎంసీ అందిస్తున్న సేవలు, సదుపాయాలతోపాటు చేపడుతున్న అభివృది ్ధపనులు, ప్రాజెక్టులపై సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తుండడంతో ‘బెస్ట్ యూజ్ ఆఫ్ సోషల్‌మీడియా ఇన్ ఏ కార్పొరేట్ కాంపెయిన్’ విభాగంలో జాతీయస్థాయి మొదటి బహుమతి లభించింది. మహిళల ఆర్థికస్వావలంబన, స్వయంవృద్ధికి తోడ్పడేలా వివిధ పథకాల అమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలను నగరంలోని మహిళలు సద్వినియోగంచేసుకునేలా ప్రోత్సహించడంతోపాటు యూసీడీ విభాగం ద్వారా సహకరిస్తుండడంతో ‘ఉమెన్ ఎంపవర్‌మెంట్’ కేటగిరీలో రెండో బహుమతి లభించింది. బాల్యం కేంద్రాల ద్వారా నగరంలోని ఐదేళ్లలోపు బాలల సంక్షేమం, ఆరోగ్యరక్షణ, విద్య, భద్రత, పోషణ, సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాల అమల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తుండడంతో బెస్ట్ సీఎస్‌ఆర్ ప్రాజెక్ట్ ఫర్ చైల్డ్‌కేర్ కేటగిరీలో జీవీఎంసీ మొదటిబహుమతి దక్కించుకుంది.