స్వచ్ఛ సర్వేక్షణ్ ఫీడ్ బ్యాక్‌లో అగ్రస్థానాన జీవీఎంసీ
ABN , Publish Date - Mar 11 , 2025 | 01:32 AM
స్వచ్ఛ సర్వేక్షణ్-2025 ఫీడ్‌బ్యాక్‌లో జీవీఎంసీ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పోటీ పడుతున్న నగరాల నుంచి ఇప్పటివరకూ 42 లక్షల మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు. అందులో 2,60,508 మంది జీవీఎంసీకి సంబంధించిన ఫీడ్‌బ్యాక్ తెలియజేసినవారు కావడం విశేషం. తర్వాత స్థానంలో పూణే (94,862 మంది), విజయవాడ (84,432), ఇండోర్ (67,108), నవీముంబై (49,672), భోపాల్ (47,750) నిలిచాయి.

విశాఖపట్నం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి):
స్వచ్ఛ సర్వేక్షణ్-2025 ఫీడ్‌బ్యాక్‌లో జీవీఎంసీ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పోటీ పడుతున్న నగరాల నుంచి ఇప్పటివరకూ 42 లక్షల మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు. అందులో 2,60,508 మంది జీవీఎంసీకి సంబంధించిన ఫీడ్‌బ్యాక్ తెలియజేసినవారు కావడం విశేషం. తర్వాత స్థానంలో పూణే (94,862 మంది), విజయవాడ (84,432), ఇండోర్ (67,108), నవీముంబై (49,672), భోపాల్ (47,750) నిలిచాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ ఫీడ్‌బ్యాక్‌లో వచ్చే మార్కులు ర్యాంకు నిర్ణయించడంలో కీలకంగా మారతాయి. ఈ నెలాఖరు వరకు వెబ్‌సైట్, స్వచ్ఛతా యాప్ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశం ఉంది.