నేడు జీవీఎంసీ ఆవిర్భావ వేడుక
ABN , Publish Date - Nov 30 , 2025 | 11:56 PM
సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్‌గార్గ్ నిర్ణయించారు.
విశాఖపట్నం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి):
గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఏర్పడి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్‌గార్గ్ నిర్ణయించారు. ఈ మేరకు పాత కౌన్సిల్‌హాల్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ మునిసిపల్ కార్పొరేషన్‌లో అనకాపల్లి, భీమిలి మునిసిపాలిటీలను విలీనం చేసి 2005 నవంబరు 30న రాష్ట్ర ప్రభుత్వం జీవీఎంసీగా అప్‌గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే.