ధారకొండ, గుమ్మిరేవుల్లో తెరుచుకోని జీయూపీ పాఠశాలలు
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:32 PM
జీకేవీధి మండలం ధారకొండ, గుమ్మిరేవులు పరిధిలో శనివారం పలు పాఠశాలలు తెరుచుకోలేదు.
మొంథా తుఫాన్ సమయంలో
సెలవులతో రెండో శనివారం సెలవు రద్దు
అయినా మూతపడిన పలు పాఠశాలలు
చర్యలు తీసుకుంటామన్న ఎంఈవో రామన్న
సీలేరు, నవబంరు 8 (ఆంధ్రజ్యోతి):
జీకేవీధి మండలం ధారకొండ, గుమ్మిరేవులు పరిధిలో శనివారం పలు పాఠశాలలు తెరుచుకోలేదు. మొంథా తుఫాన్ సమయంలో ప్రభుత్వం మూడు రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండో శనివారం పాఠశాలలకు సెలవును రద్దు చేసి, పాఠశాలలను తెరవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇవేవీ మాకు వర్తించవు అన్నట్టుగా ఈప్రాంత ఉపాధ్యాయులు పాఠశాలలకు తాళాలు వేసి శుక్రవారం సాయంత్రమే స్వగ్రామాలకు వెళ్లిపోయారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాలలకు సెలవు లేకపోయినా ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. దీనిపై మండల విద్యాశాఖాధికారి ఎం.రామన్నను వివరణ కోరగా. పాఠశాలలకు శనివారం సెలవు లేదన్నారు. ఉపాధ్యాయులు సెలవులు పెట్టుకుని వెళ్లినట్టు తనకు ఎటువంటి సమాచారం లేదన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.