Share News

గుల్లిపాడు రైల్వేస్టేషన్‌కు మహర్దశ

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:33 AM

మండలంలో పురాతనమైన గుల్లిపాడులో రైల్వేస్టేషన్‌కు రానున్న రోజుల్లో మహర్దశ పట్టనుంది. ఇక్కడి నుంచి ఉక్కు ఎగుమతులతో స్టేషన్‌ రద్దీగా మారనున్నది. నక్కపల్లి మండలంలో ఆర్సెలర్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్‌ ఇండియా కంపెనీలు రూ 1.4 లక్షల కోట్ల వ్యయంతో భారీ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌లోని నక్కపల్లి క్లస్టర్‌లో ఏర్పాటుకానున్న భారీ ఉక్కు ఫ్యాక్టరీ.. రానున్న రోజుల్లో గుల్లిపాడు రైల్వేస్టేషన్‌కు ఒక వరం కాబోతున్నది. ప్రస్తుతం వున్న రైల్వేస్టేషన్‌ భవనం దాదాపు 90 ఏళ్ల కిందట నిర్మించింది కావడంతో శిఽథిలావస్థలో వుంది. ఈ నేపథ్యంలో నక్కపల్లి మండలంలో ఏర్పాటు కానున్న స్టీల్‌ ప్లాంట్‌కు ముడి ఖనిజాల దిగుమతి, ఉత్పత్తి అయిన ఉక్కును ఎగుమతి చేసేందుకు రైలుమార్గం ఎంతో కీలకం. ఇందుకోసం గుల్లిపాడు రైల్వేస్టేషన్‌ అన్ని విధాలా అనుకూలంగా వుందని రైల్వే వర్గాలు, కేంద్ర పరిశ్రమల శాఖలు ఇప్పటికే గుర్తించాయి.

గుల్లిపాడు రైల్వేస్టేషన్‌కు మహర్దశ
గుల్లిపాడు రైల్వేస్టేషన్‌ లో కొత్తగా నిర్మించిన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి

నక్కపల్లి స్టీల్‌ప్లాంట్‌ వరకు కొత్తగా రైల్వే ట్రాక్‌ నిర్మాణం?

ముడి సరకు, ఉక్కు ఉత్పత్తుల రవాణా కోసం..

రైల్వే ట్రాక్‌ ఏర్పాటుపై అధ్యయనం

రైల్వేస్టేషన్‌ నూతన భవన నిర్మాణ పనులకు శ్రీకారం

ఇప్పటికే అందుబాటులోకి ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి

ప్లాట్‌ ఫారాలపై రేకుల షెడ్ల నిర్మాణం

నక్కపల్లి, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): మండలంలో పురాతనమైన గుల్లిపాడులో రైల్వేస్టేషన్‌కు రానున్న రోజుల్లో మహర్దశ పట్టనుంది. ఇక్కడి నుంచి ఉక్కు ఎగుమతులతో స్టేషన్‌ రద్దీగా మారనున్నది. నక్కపల్లి మండలంలో ఆర్సెలర్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్‌ ఇండియా కంపెనీలు రూ 1.4 లక్షల కోట్ల వ్యయంతో భారీ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌లోని నక్కపల్లి క్లస్టర్‌లో ఏర్పాటుకానున్న భారీ ఉక్కు ఫ్యాక్టరీ.. రానున్న రోజుల్లో గుల్లిపాడు రైల్వేస్టేషన్‌కు ఒక వరం కాబోతున్నది. ప్రస్తుతం వున్న రైల్వేస్టేషన్‌ భవనం దాదాపు 90 ఏళ్ల కిందట నిర్మించింది కావడంతో శిఽథిలావస్థలో వుంది. ఈ నేపథ్యంలో నక్కపల్లి మండలంలో ఏర్పాటు కానున్న స్టీల్‌ ప్లాంట్‌కు ముడి ఖనిజాల దిగుమతి, ఉత్పత్తి అయిన ఉక్కును ఎగుమతి చేసేందుకు రైలుమార్గం ఎంతో కీలకం. ఇందుకోసం గుల్లిపాడు రైల్వేస్టేషన్‌ అన్ని విధాలా అనుకూలంగా వుందని రైల్వే వర్గాలు, కేంద్ర పరిశ్రమల శాఖలు ఇప్పటికే గుర్తించాయి. గుల్లిపాడు రైల్వేస్టేషన్‌ నుంచి కొత్తగా నిర్మించనున్న ఉక్కు ఫ్యాక్టరీ వరకు కొత్తగా రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాల్సి వుంటుంది. రైల్వే ట్రాక్‌ను ఏ గ్రామాల పరిధిలో నుంచి వేయాల్సి వుంటుంది, ఎంతమేర భూములను సేకరించాలన్న దానిపై ఒక ఉన్నతస్థాయి బృందం ఇప్పటికే అధ్యయనం చేసింది. రైల్వే ట్రాక్‌ నిర్మాణం, భూ సేకరణకు పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేయాల్సి వుంటుంది. ఇందులో కొంత మొత్తాన్ని ప్రైవేటు స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం, మరికొంత మొత్తాన్ని రైల్వే శాఖ భరిస్తాయని తెలిసింది. గుల్లిపాడు నుంచి స్టీల్‌ ప్లాంట్‌వరకు రైల్వే ట్రాక్‌ నిర్మాణం చేపడితే.. అప్పుడు ఈ స్టేషన్‌ను ‘గుల్లిపాడు జంక్షన్‌’గా మార్చాల్సి వుంటుంది. స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగుల అవసరాల దృష్ట్యా ఈ స్టేషన్‌లో కొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్ట్‌ సదుపాయం కల్పించే అవకాశం వుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

రైల్వేస్టేషన్‌ నూతన భవననిర్మాణ పనులకు శ్రీకారం

గుల్లిపాడు స్టేషన్‌లో ప్రస్తుతం ఉన్న భవనం చిన్నది కావడమే గాకుండా శిథిలావస్థకు చేరింది. దీనికితోడు కొత్తగా నిర్మించనున్న ఉక్కు ఫ్యాక్టరీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ రైల్వేస్టేషన్‌కు కొత్త భవన నిర్మాణ పనులకు రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం వున్న స్టేషన్‌కు ఆనుకుని, సకల సదుపాయాలతో కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. మరో ఏడాదిలో నిర్మాణ పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. ప్రయాణికులు వేచి వుండేందుకు షెడ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.

Updated Date - Jun 27 , 2025 | 12:33 AM