స్వర్ణాంధ్ర సాధనలో జీఎస్టీ 2.0 గొప్ప గేమ్ చేంజర్
ABN , Publish Date - Oct 16 , 2025 | 10:16 PM
పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థికాభివృద్ధిలో, స్వర్ణాంధ్ర సాధనలో జీఎస్టీ 2.0 గొప్ప గేమ్ చేంజర్‌గా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అన్నారు. ఈ శుభ పరిణామంతో భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌పై అవగాహనలో భాగంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో గురువారం ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్‌ను కలెక్టర్ ప్రారంభించారు.
కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్
ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ ప్రారంభం
మద్దిలపాలెం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థికాభివృద్ధిలో, స్వర్ణాంధ్ర సాధనలో జీఎస్టీ 2.0 గొప్ప గేమ్ చేంజర్‌గా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అన్నారు. ఈ శుభ పరిణామంతో భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌పై అవగాహనలో భాగంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో గురువారం ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. 1990లో ఎల్పీజీ (లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్)లా ఇది అనూహ్య ఫలితాలను ఇస్తుందనిన్నారు. జీఎస్టీని నాలుగు స్లాబ్‌ల నుంచి రెండింటికి తగ్గించడం హర్షణీయమన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించడంలో జీఎస్టీ 2.0 చుక్కానిలా ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రేట్ వైజాగ్ ఫెస్టివల్ మంచి ఫ్లాట్‌పామ్‌గా నిలుస్తోందన్నారు. ఈ నెల 19 వరకు జరిగే ఈ ఫెస్టివల్‌ను ప్రజలందరూ విజయవంతం చేయాలని హరేంధిర ప్రసాద్ కోరారు.
అనంతరం ఫెస్టివల్‌లో ఏర్పాటు చేసిన 60 స్టాళ్లను ఆయన సందర్శించి, నూతన జీఎస్టీ స్లాబ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రాష్ట్ర జీఎస్టీ అదనపు కమిషనర్ సీతారాం శేఖర్, జిల్లా పర్యాటకశాఖ అధికారిణి జె.మాధవి, యూసీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యవేణి, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మీపతి, జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.