Share News

ప్రత్యేక రైళ్లకు పెరుగుతున్న ఆదరణ

ABN , Publish Date - Oct 07 , 2025 | 11:24 PM

ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే అధికారులు అనకాపల్లి నుంచి సికింద్రాబాద్‌, తిరుపతిలకు ప్రవేశపెట్టిన ప్రత్యేక రైళ్లకు ఆదరణ పెరుగుతున్నది. 07059 నంబరుతో సోమవారం సికింద్రాబాద్‌లో బయలుదేరిన ప్రత్యేక రైలు మంగళవారం ఉదయం అనకాపల్లి చేరుకుంది.

ప్రత్యేక రైళ్లకు పెరుగుతున్న ఆదరణ
రిజర్వేషన్‌ బోగీలో మహిళా ప్రయాణికులు

అనకాపల్లి- సికింద్రాబాద్‌ రైలులో బెర్త్‌లన్నీ ఫుల్‌

అనకాపల్లి టౌన్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే అధికారులు అనకాపల్లి నుంచి సికింద్రాబాద్‌, తిరుపతిలకు ప్రవేశపెట్టిన ప్రత్యేక రైళ్లకు ఆదరణ పెరుగుతున్నది. 07059 నంబరుతో సోమవారం సికింద్రాబాద్‌లో బయలుదేరిన ప్రత్యేక రైలు మంగళవారం ఉదయం అనకాపల్లి చేరుకుంది. తిరిగి 07060 నంబరుతో మంగళవారం సాయంత్రం 5.35 గంటలకు అనకాపల్లి నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరింది. ఈ రైలులో తొమ్మిది ఏసీ బోగీలు, ఆరు స్లీపర్‌ క్లాస్‌ బోగీలు, నాలుగు జనరల్‌ బోగీలతోపాటు దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక బోగీ వున్నాయి. అన్ని శ్రేణుల బోగీల్లో బెర్త్‌లన్నీ నిండడంతోపాటు 50 వరకు వెయిటింగ్‌ లిస్టు వున్న వున్నట్టు స్థానిక స్టేషన్‌ అధికారులు చెప్పారు. అనకాపల్లి, చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా లంకెలపాలెం, కూర్మన్నపాలెం, గాజువాకల నుంచి పలువురు ప్రయాణికుల్లో ఈ రైల్లో వెళ్లడానికి రిజర్వేషన్‌ చేయించుకున్నారు. ఈ రైలు ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమహేంద్రవరం, తణుకు, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి మీదుగా బుధవారం ఉదయం 8.40 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుందని స్టేషన్‌ మేనేజర్‌ సచ్చి నివాస్‌ తెలిపారు.

Updated Date - Oct 07 , 2025 | 11:24 PM