డిగ్రీలో సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానానికి గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:38 AM
డిగ్రీ కోర్సుల్లో సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో డిగ్రీ ప్రవేశాలకు కూడా తెర తీసినట్టు అయింది. ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ కోర్సులు సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానమా?, డబుల్ మేజర్ సబ్జెక్టు విధానమా? అన్నది రెండు నెలలుగా డైలమాలో పడి డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఆన్‌లైన్ అడ్మిషన్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- స్పష్టత రావడంతో ప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకుంటున్న కళాశాలల యాజమాన్యాలు
- త్వరలో డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్లకు నోటిఫికేషన్
నర్సీపట్నం, జూలై 8(ఆంధ్రజ్యోతి): డిగ్రీ కోర్సుల్లో సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో డిగ్రీ ప్రవేశాలకు కూడా తెర తీసినట్టు అయింది. ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ కోర్సులు సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానమా?, డబుల్ మేజర్ సబ్జెక్టు విధానమా? అన్నది రెండు నెలలుగా డైలమాలో పడి డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఆన్‌లైన్ అడ్మిషన్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆఫ్ లైన్ చేయమని కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే ఆన్‌లైన్ అడ్మిషన్లుకే ఉన్నత విద్యాశాఖ మొగ్గు చూపింది. ఈ ఏడాది డబుల్ మేజర్ సబ్జెక్టు విధానం ఉండదని తేలడంతో కళాశాల యాజమాన్యాలు అడ్మిషన్లకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. నర్సీపట్నం డిగ్రీ కళాశాలలో సింగిల్ మేజర్ సబ్జెక్టులు బీఏ హిస్టరీ 40 సీట్లు, బీఏ పొలిటికల్ సైన్స్ 40, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ 60, బీఎస్సీ కెమిస్ట్రీ 40, బీఎస్పీ కంప్యూటర్ సైన్స్ 40, బీఎస్సీ బోటనీ 40, ఫిజిక్స్ 40 సీట్లు ఖాళీలు ఉన్నాయి. ఈ వారంలో డిగ్రీ అడ్మిషన్లుకు సంబంధించి నోటిషికేషన్ వస్తుందని అధికారులు అంటున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులు నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ పెట్టుకునే సదుపాయలం కల్పిస్తామని ప్రిన్సిపాల్ ఎస్.రాజు తెలిపారు.