Share News

హరిత రిసార్ట్స్‌కు సొబగులు

ABN , Publish Date - Oct 23 , 2025 | 11:11 PM

మండల కేంద్రంలోని హరిత రిసార్ట్స్‌ ఆధునికీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పర్యాటకులను ఆకట్టుకునేలా అన్ని హంగులు ఏర్పాటు చేస్తున్నారు.

హరిత రిసార్ట్స్‌కు సొబగులు
ఆధునికీకరించిన తరువాత హరిత రిసార్ట్స్‌ గది

రూ.4 కోట్లతో ఆధునికీకరణ పనులు

పర్యాటకులను ఆకట్టుకునేలా హంగులు

అనంతగిరి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని హరిత రిసార్ట్స్‌ ఆధునికీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పర్యాటకులను ఆకట్టుకునేలా అన్ని హంగులు ఏర్పాటు చేస్తున్నారు. పర్యాటక శాఖ 2006లో ఈ రిసార్ట్స్‌ను ప్రారంభించింది. పర్యాటకులు, ప్రముఖులను సైతం ఇది ఎంతో ఆకట్టుకుంది. దీనిని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు రూ.4 కోట్లు కేటాయించారు. ఇప్పటికే 28 గదుల ఆధునికీరణ పనులు పూర్తయ్యాయి. రెస్టారెంట్‌, రిసెప్షన్‌ తదితర పనులు కొనసాగుతున్నాయి. అలాగే కాన్ఫరెన్స్‌ హాల్‌, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి. త్వరలో అన్ని గదులకు వైఫై సదుపాయం అందుబాటులోకి రానుంది.

Updated Date - Oct 23 , 2025 | 11:11 PM