గ్రీన్ రైల్వేస్టేషన్
ABN , Publish Date - Sep 07 , 2025 | 01:21 AM
విశాఖ రైల్వే స్టేషన్‌కు ‘గ్రీన్ రైల్వే స్టేషన్’ గుర్తింపు లభించింది.
విశాఖ రైల్వే స్టేషన్‌కు గ్లోబల్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గుర్తింపు
విశాఖపట్నం, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి):
విశాఖ రైల్వే స్టేషన్‌కు ‘గ్రీన్ రైల్వే స్టేషన్’ గుర్తింపు లభించింది. ఈ మేరకు గ్లోబల్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ శనివారం ధ్రువపత్రాన్ని జారీ చేసింది. ఈ సందర్భంగా డీఆర్‌ఎం లలిత్ బొహ్రా మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన గ్రీన్ రైల్వే స్టేషన్ గుర్తింపు లభించడం సంతోషకరమన్నారు. ప్రతికూల పర్యావరణ ప్రభావాన్ని నియంత్రించడానికి అనుకూల పద్ధతులు, స్థిరమైన ప్రమాణాలు అవలంబించడంతో ఈ గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. స్టేషన్‌లో పారిశుధ్య నిర్వహణ, తగిన ప్రమాణాలు పాటించడంలో అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. స్టేషన్‌లో ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పడంలో డివిజన్ పర్యావరణ, హౌస్ కీపింగ్ మేనేజ్‌మెంట్ విభాగంతోపాటు అన్ని విభాగాలు కృషి ఉందన్నారు.