Share News

ఘనంగా పైడిమాంబ తొలేళ్ల ఉత్సవం

ABN , Publish Date - Mar 11 , 2025 | 01:31 AM

కంచరపాలెం ప్రాంతంలోని రామ్మూర్తిపంతులుపేట గ్రామ దేవత పైడితల్లమ్మ తొలేళ్ల ఉత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ సంప్రదాయం ప్రకారం పెద్దసంఖ్యలో భక్తులు నగరంలోని పాత జైలు రోడ్డు వద్ద గల బంగారమ్మ గుడికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ప్రతిమలను మోసుకుంటూ జగదాంబ సెంటర్‌, పూర్ణామార్కెట్‌, మనోరమ, కాన్వెంట్‌ జంక్షన్‌, జ్ఞానాపురం మీదుగా ఆర్పీపేటలోని అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఉత్సవం సందర్భంగా అమ్మవారి ప్రధానాలయాన్ని దేదీప్యమానంగా అలంకరించారు. మంగళవారం ప్రధాన పండగ కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. -ఆంధ్రజ్యోతి, కంచరపాలెం

ఘనంగా పైడిమాంబ తొలేళ్ల ఉత్సవం

కంచరపాలెం ప్రాంతంలోని రామ్మూర్తిపంతులుపేట గ్రామ దేవత పైడితల్లమ్మ తొలేళ్ల ఉత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ సంప్రదాయం ప్రకారం పెద్దసంఖ్యలో భక్తులు నగరంలోని పాత జైలు రోడ్డు వద్ద గల బంగారమ్మ గుడికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ప్రతిమలను మోసుకుంటూ జగదాంబ సెంటర్‌, పూర్ణామార్కెట్‌, మనోరమ, కాన్వెంట్‌ జంక్షన్‌, జ్ఞానాపురం మీదుగా ఆర్పీపేటలోని అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఉత్సవం సందర్భంగా అమ్మవారి ప్రధానాలయాన్ని దేదీప్యమానంగా అలంకరించారు. మంగళవారం ప్రధాన పండగ కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు.

-ఆంధ్రజ్యోతి, కంచరపాలెం

Updated Date - Mar 11 , 2025 | 01:31 AM