22న గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక
ABN , Publish Date - Oct 20 , 2025 | 12:05 AM
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ నెల 22న నగరానికి రానున్నారు.
విశాఖపట్నం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ నెల 22న నగరానికి రానున్నారు. బుధవారం రాత్రి 9.05 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఆయన రోడ్డు మార్గంలో పోతినమల్లయ్యపాలెంలోని వైజాగ్ కన్వెన్షన్‌లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం నోవాటెల్ హోటల్ వెళతారు. మరుసటి రోజు సాయంత్రం 4.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి బెంగళూరు వెళ్తారు.