Share News

మైనారిటీల రక్షణ, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం

ABN , Publish Date - May 18 , 2025 | 12:38 AM

రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు సంపూర్ణ రక్షణతోపాటు, వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల సలహాదారు, శాసనమండలి మాజీ చైర్మన్‌ షరీఫ్‌ మహమ్మద్‌ అహ్మద్‌ తెలిపారు.

మైనారిటీల రక్షణ, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం
రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల సలహాదారు షరీఫ్‌ మహమ్మద్‌ అహ్మద్‌ను సత్కరిస్తున్న ముస్లింలు

రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల సలహాదారు షరీఫ్‌ మహమ్మద్‌ అహ్మద్‌

చోడవరం, మే 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలకు సంపూర్ణ రక్షణతోపాటు, వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నదని రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల సలహాదారు, శాసనమండలి మాజీ చైర్మన్‌ షరీఫ్‌ మహమ్మద్‌ అహ్మద్‌ తెలిపారు. ఆయన శనివారం చోడవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మసీదులో ముస్లింలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఆయన వెంట ఎమ్మెల్యే రాజు, ముస్లిం సంఘాల నాయకులు వున్నారు.

Updated Date - May 18 , 2025 | 12:38 AM