విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:54 AM
రాష్ట్రంలో విద్యాభివృద్ధి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. మండలంలోని జోగంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ‘తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించేందుకు మావన వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా కృషి చేస్తున్నారని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ప్రణాళికను రూపొందించి అమలు చేయిస్తున్నారని చెప్పారు.
పట్టుదలతో చదువుకుంటే ఉజ్వల భవిష్యత్తు
ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి
శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
గొలుగొండ, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యాభివృద్ధి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. మండలంలోని జోగంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ‘తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించేందుకు మావన వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా కృషి చేస్తున్నారని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ప్రణాళికను రూపొందించి అమలు చేయిస్తున్నారని చెప్పారు. విద్యార్థి దశలో పట్టుదలతో చదువుంటే భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించి, ఉన్నతంగా జీవించే అవకాశం వుంటుందని అన్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపైనే వుందని చెప్పారు. పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా వుంచాలని సూచించారు. ఉపాధి హామీ పథకం నిధులతో పాఠశాలల్లో క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేయిస్తున్నామని, విద్యార్థులు క్రీడల్లో బాగా రాణించేలా ఉపాధ్యాయులు, పీఈటీలు కృషి చేయాలన్నారు. విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, ఇన్‌చార్జి తహసీల్దార్ రామారావు, ఇన్‌చార్జి ఎంఈవో సత్యనారాయణ, హెచ్‌ఎం నాగభూషణం, మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు చిటికెల తారకవేణుగోపాల్, టీడీపీ నాయకులు అడిగర్ల అప్పలనాయుడు, చిటికెల సాంబమూర్తి, సుర్ల బాబ్జి, మురళి, పుల్లేటికుర్తి రమేష్, నర్సీపట్నం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త రాజాన వీసూర్యచంద్ర, తదితరులు పాల్గొన్నారు.